సాధారణంగా కొత్త అనుభవం వచ్చిన తరువాత వారి కంటూ ఓ అభిప్రాయం ఏర్పడిపోతుంది. అదే కరెక్ట్ అని కూడా అనిపిస్తుంది. అదే విజయమార్గం అని కూడా ఫిక్సయిపోతారు. వేరే వాళ్లు ఇది కొత్తది..ఇది నప్పుతుంది..ఇది ట్రయ్ చేయండి అన్నా కాస్త డవుట్ పడతారు..హీరో వెంకీ ఇప్పుడు ఈ విధమైన జోన్ నుంచి బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది.
దృశ్యం, గోపాల గోపాల రీమేక్ లు. వాటి ఒరిజినల్స్ చూసి..ఓహో ఇలా వుంటాయా..అయితే ఓకె అన్నారు. కానీ అదే ఇక్కడి డైరక్టర్లు ఏదో ఒక సబ్జెక్ట్ బాగా ఆలోచించి, వెంకీకి నప్పుతుంది అని తీసుకెళ్తే మాత్రం, ఆయన ఓ పట్టాన దారికి రావడం లేదని వినికిడి.
ఇలా అయితే బాగుంటుంది..అలా అయితే బాగుంటుంది..అంటూ స్క్రిప్ట్ మొత్తం మారిపోయే సూచనలిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో దర్శకులు ఓ స్టేజ్ వరకు ఆయనతో ప్రయాణించి, మెల్లగా పక్కకు తప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది.
కథానాయకులు సబ్జెక్ట్ మీద అబ్జెక్షన్లు చెబితే, అలాగే మార్చుకు వస్తాం అనే రోజులు మారిపోతున్నాయి. అలాగే అని, చెప్పి వేరే హీరో కాంపౌండ్ లోకి వెళ్తున్నారు. ఎక్కడో అక్కడ సెట్ అయి, హిట్ కొడుతున్నారు. అబ్జెక్షన్లు చెప్పిన వారు అవాక్కవుతున్నారు. ఆ మధ్య వెంకీతో చాలా మంది డైరక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఏదీ ఇంతవరకు మెటీరిలైజ్ కాలేదు. పైగా అదే డైరక్టర్లవి వేరే ప్రాజెక్టులు అనౌన్స్ అవుతున్నాయి. అంటే ఇక్కడ సెట్ కాలేదు అనుకోవాల్సిందే.
సీనియర్ హీరోలు కాంటెంపరరీగా ఆలోచించలేనపుడు, కాస్త సరైన డైరక్టర్ చూసి నమ్మకం కుదర్చుకోవాలి. లేదూ..ఇలాగే వుంటుంది పరిస్థితి.