సంపత్ కు ఇద్దరు భార్యలా?

సంపత్..తమిళం లోంచి తెలుగులోకి వచ్చి, ఇటీవల మాంచి ఫామ్ లోకి వచ్చిన విలన్లలో ఒకడు. సంపత్ కు ఇఫ్పుడు మాంచి క్యారెక్టర్ బ్రూస్ లీ లో దొరికింది. ఈ క్యారెక్టర్ కు భార్యగా నదియా…

సంపత్..తమిళం లోంచి తెలుగులోకి వచ్చి, ఇటీవల మాంచి ఫామ్ లోకి వచ్చిన విలన్లలో ఒకడు. సంపత్ కు ఇఫ్పుడు మాంచి క్యారెక్టర్ బ్రూస్ లీ లో దొరికింది. ఈ క్యారెక్టర్ కు భార్యగా నదియా నటిస్తోంది. పైగా మరో భార్య కూడా వుంటుందని తెలుస్తోంది. ఒక భార్య కొడుకుతో హీరో సోదరికి నిశ్చితార్థం జరిగితే, మరో భార్య కొడుకు ఆమె పాలిట విలన్ గా మారతాడని బ్రూస్ లీ కథపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

అయితే బ్రూస్ లీ లో సంపత్ విలన్ నా..కాదా అన్నది కాకుండా ఓ డిఫరెంట్ క్యారెక్టర్ గా వుంటుంది. బ్రహ్మానందం క్యారెక్టర్ ను కూడా ఈ సంపత్ క్యారెక్టర్ మీదకే ప్రయోగిస్తారు. మొత్తంగా చూస్తే బ్రూస్ లీ లో ఫ్యామిలీ డ్రామా పాలు కాస్త ఎక్కువగానే వుంటుదని తెలుస్తోంది. తండ్రి, తల్లి, కొడకును కలెక్టర్ గా చూడాలనుకునే తండ్రి, కల్టక్టర్ కావాలనుకునే కూతురు, ఆమెను కలెక్టర్ చేయడం కోసం తాను ఫైటర్ గా మారే తమ్ముడు. వీరందిరి అనుబంధాలను చూసి మురిసిపోయే తల్లి, వీరితో వియ్యం అందుకునే సంపత్, నదియా, విలన్ గా మారే సంపత్ కొడుకు.ఇదీ సినిమాకు కీలకమైన పాత్రలు. 

క్లయిమాక్స్ లో విలన్ కారణంగా తండ్రిని కాపాడుకోవడానికి కొడుకు, తనకు అభిమానమున్న పైటర్ ప్రియురాలిని కాపాడేందుకు రంగంలోకి దిగే మెగా హీరో. ఫైటర్, మెగా హీరో ఇద్దరూ క్లయిమాక్స్ లో గుర్రాల మీద యాక్షన్ కు దిగడం. మొత్తం మీద సినిమా ఇటు ఫ్యామిలీలను ఎంటర్ టైన్ చేయడానికి టార్గెట్ చేస్తూనే, మాస్, యాక్షన్ ను కూడా జోడించుకుంది. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.