గీతా, యువీ పై కూడా ఐటి తనిఖీలు

బ్రూస్ లీ నిర్మాత, డైరక్టర్, మ్యూజిక్ డైరక్టర్ తదితరులు ఇళ్లపై ఐడి దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో మరో సంగతి వెలుగులోకి వచ్చింది. భలే భలే మగాడివోయ్ వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన గీతా…

బ్రూస్ లీ నిర్మాత, డైరక్టర్, మ్యూజిక్ డైరక్టర్ తదితరులు ఇళ్లపై ఐడి దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో మరో సంగతి వెలుగులోకి వచ్చింది. భలే భలే మగాడివోయ్ వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ సంస్థల కార్యాలయాలపై కూడా రెండు, మూడు రోజుల క్రితం ఐటి అధికారులు దాడులు చేసినట్లు తెలిసింది. వీరు ఆయా కార్యాలయాల్లో రికార్డులు తనిఖీ చేసారని తెలిసింది. 

కేవలం ఆరేడు కోట్లతో సినిమా తీసి, భలే భలే మగాడివోయ్ తో పాతిక కోట్ల కలెక్షన్లు కొల్ల గొట్టారు. అయితే విషయం అది కాదు. ఈ లాభాలు బయ్యర్లకు కాకుండా, నిర్మాతలకే ఎక్కువ చేరడం. ఎందుకంటే నైజాం, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, విశాఖ ఏరియాల హక్కులు నిర్మాతల దగ్గరే వుంచుకున్నారు. అవి లాభాలు పండించాయి.

వీటన్నింటి రీత్యా జరిగిన బిజినెస్, అక్కౌంట్స్ అన్నీ అధికారులు పరిశీలించారని వినికిడి. దీన్ని బట్టి చూస్తుంటే ఇక టాలీవుడ్ బడా నిర్మాతలు, హీరోలు కాస్త జాగ్రత్తగా వుండాలేమో? పొలిటికల్ బ్యాక్ గ్రవుండ్, అధికారపక్ష అండ వున్న హీరోలకు ఫరవాలేదు కానీ తమిళ నాట విజయ్ మాదిరిగా మన హీరోలు టార్గెట్ కాకుండా చూసుకోవాలి.