చరణ్ అదృష్టమే అదృష్టం

అదేం అదృష్టమో కానీ మెగా బడా హీరోలు చరణ్, బన్నీ ఎప్పుడు సినిమాలు వదిలినా, వాటికి వెనక, ముందు వచ్చిన సినిమాలు భలేగా రేస్ లోంచి తప్పుకుంటాయి. అయితే ఫ్లాప్ కావడమో, వాయిదా పడడమో…

అదేం అదృష్టమో కానీ మెగా బడా హీరోలు చరణ్, బన్నీ ఎప్పుడు సినిమాలు వదిలినా, వాటికి వెనక, ముందు వచ్చిన సినిమాలు భలేగా రేస్ లోంచి తప్పుకుంటాయి. అయితే ఫ్లాప్ కావడమో, వాయిదా పడడమో అవుతుంటుంది. విడుదలకు ముందు ఫుల్ టైట్ షెడ్యూలు, పోటీ పోటీ అన్నట్లు అనిపిస్తుంది. 

కానీ రాను రాను ఒక్కోటి తప్పుకుంటాయి. వచ్చినవి కూడా చీదేస్తుంటాయి. దీంతో అలా అలా సింగిల్ గా రేస్ లో ముందుకు వెళ్లి నలభై కోట్ల క్లబ్ చేరేస్తుంటాయి. ఇప్పుడు మళ్లీ బ్రూస్ లీ వ్యవహారం కూడా అలాగే కనిపిస్తోంది. 16 వ తేదీ నుంచి అయిదో తేదీ వరకు అంటే దాదాపు మూడు వారాలు సరైన సినిమా లేనట్లే. కళ్యాణ్ రామ్ షేర్ సినిమా వుంది కానీ, దానికి అంత సీన్ వుండకపోవచ్చు. 

అయిదున కంచె రావచ్చు రాకపోవచ్చు, బెంగాల్ టైగర్ మాత్రం వుంటుంది. అయినా ఈ మూడు వారాలు చాలదా దున్నేసుకోవడానికి.