సమంత సీన్‌ రివర్స్‌

తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడమే మాయ చేసి పారేసిన సమంత… రెండో సినిమాకే ఎన్టీఆర్‌తో, మూడో సినిమాకి మహేష్‌తో నటించేసి.. నాలుగు సినిమాలు తిరిగేలోగా అగ్ర హీరోయిన్‌ అయిపోయింది. కానీ అదే విధమైన…

తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడమే మాయ చేసి పారేసిన సమంత… రెండో సినిమాకే ఎన్టీఆర్‌తో, మూడో సినిమాకి మహేష్‌తో నటించేసి.. నాలుగు సినిమాలు తిరిగేలోగా అగ్ర హీరోయిన్‌ అయిపోయింది. కానీ అదే విధమైన లాంఛ్‌ ప్యాడ్‌ ఆమెకి తమిళంలో దొరకలేదు. తెలుగులో కంటే తమిళంలోనే ముందుగా తెరంగేట్రం చేసిన సమంత నటించిన తొలి రెండు తమిళ చిత్రాలు ఫ్లాపయ్యాయి.

తెలుగులో డిమాండ్‌ అధికంగా ఉండడంతో ఆమె ఫోకస్‌ అంతా తెలుగు చిత్ర సీమపై పెట్టింది. తెలుగులో టాప్‌ సీట్‌కి ఢోకా లేకపోవడంతో ఈమధ్య తమిళ చిత్రాలపై దృష్టి పెట్టింది. సూర్య, విజయ్‌, విక్రమ్‌లాంటి స్టార్స్‌తో వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అయితే సమంత జాతకం ఇంకా అరవనాడులో ఏం మారలేదు. 

ఆమె తాజా చిత్రం అంజాన్‌ (సికిందర్‌) డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో తమిళంలో తన సక్సెస్‌ స్టోరీ స్టార్ట్‌ అవుతుందని అనుకున్న సమంతకి సీన్‌ రివర్స్‌ అయింది. దీంతో ఇప్పుడు విజయ్‌తో చేస్తున్న కత్తి మీద ఆశలు పెట్టుకుంది. అంజాన్‌ ఫ్లాప్‌ అయినా కానీ ఆమెకి కోలీవుడ్‌పై ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు. విజయ్‌తో కత్తి, విక్రమ్‌ మలి చిత్రంలో నటించడం ద్వారా సమంత హోప్స్‌ మిగిలే ఉన్నాయి.