రాబోయే పెద్ద సినిమాల్లో ఏదో ఒకటి అత్తారింటికి దారేది రికార్డుని కొట్టేసి టాప్ సీట్ దక్కించుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆగడు, రభస, గోవిందుడు అందరివాడేలే చిత్రాల్లో ఏదొటకి ఈ ఫీట్ సాధిస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ అది అనిపించినంత ఈజీ వ్యవహారం అయితే కాదు.
ఇప్పుడు వచ్చే ఏ పెద్ద సినిమా అయినా కానీ కనీసం మూడు వారాల పాటు ఎక్కువ థియేటర్లు సొంతం చేసుకోవాలి. కానీ సినిమాల రద్దీ కారణంగా రిలీజ్‌కే ఎక్కువ థియేటర్లు దొరికే పరిస్థితి లేదు. వారం తర్వాత వారం ఒక్కో పెద్ద సినిమా లేదా మీడియం బడ్జెట్ సినిమా వస్తూనే ఉంటుంది. వినాయక చవితితో మొదలు పెట్టి దసరా వరకు అదే పరిస్థితి.
ఇక అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేయడం, తర్వాత రెండు వారాల పాటు ఎక్కువ థియేటర్లు గుప్పిట్లో ఉంచుకోవడం మహామహుల వల్ల కూడా కాని పని. భారీ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుని, మిగతా సినిమాలు హోప్‌లెస్‌గా అనిపిస్తే తప్ప ‘అత్తారింటికి దారి’ కనుక్కోవడం ఈసారికి అంత ఈజీ కాదు సుమీ!