‘రభస’ చిత్రానికి ఎందుకో ఆశించినంతగా క్రేజ్ రావడం లేదు. ఈ చిత్రం ట్రెయిలర్ చూడ్డానికి అభిమానులు సైతం ఆసక్తి చూపించడం లేదు. ఈమధ్య ఏ పెద్ద సినిమా టీజర్ లేదా ట్రెయిలర్ వచ్చినా మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం చాలా మామూలైపోయింది. కానీ రభసకి మాత్రం నామమాత్రపు స్పందన మాత్రమే వచ్చింది.
సినిమాపై ఎక్సయిట్‌మెంట్‌ని ట్రెయిలర్‌తో పాటు ఆడియో కూడా తగ్గించాయి. సినిమా మరో పది రోజుల్లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. కానీ ఇంకా దీనిపై అంచనాలు పెంచడానికి ఎలాంటి ప్రత్యేక ప్రయత్నాలు మొదలు కాలేదు. ట్రెయిలర్ బ్యాడ్‌గా కట్ చేసారని కామెంట్స్ వచ్చినా కానీ బెటర్ కట్ ఇంతదాకా రిలీజ్ చేయలేదు.
ఇప్పుడు ఏ సినిమాకి అయినా విడుదలకి ముందు రేకెత్తించే ఆసక్తే ఆక్సిజన్. ఎంతగా జనాన్ని ముందుగా ఆకర్షిస్తే అంతగా ఓపెనింగ్స్ వస్తాయి. అన్ని డబ్బులు తొలి వారంలో రికవర్ అవుతాయి. చాలా గ్యాప్ తర్వాత వస్తోన్న భారీ చిత్రం కావడంతో రభసకి టైమింగ్ అడ్వాంటేజ్ ఉంది. దానిని మాగ్జిమమ్ యుటిలైజ్ చేసుకునే ప్లానింగ్ మాత్రం తప్పనిసరి.