నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తొలి చిత్రానికి ‘ముకుంద’ టైటిల్ ఖరారు కావడంతో ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న మెగా హీరోల సినిమాలన్నిటి పేర్ల మధ్య సారూప్యం ఫాన్స్‌ని ఎక్సయిట్ చేస్తోంది. పవన్‌కళ్యాణ్ ‘గోపాల గోపాల’ చేస్తుంటే, చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ అంటూ వస్తోన్న సంగతి తెలిసిందే.
ఒకరు గోపాలుడు, మరొకరు గోవిందుడు, ఇంకొకరు ముకుందుడు… అంటూ అచ్చమైన తెలుగు పేర్లతో, పాజిటివ్ అప్పీల్ ఉన్న టైటిల్స్‌తో వస్తోన్న మెగా హీరోలు ఎలాంటి ఫలితాలు సాధిస్తారో కానీ ఈ టైటిల్స్‌తో సోషల్ నెట్‌వర్క్‌లో ఫాన్స్ సందడి బాగుంది.
దసరాకి చరణ్ గోవిందుడుగా, దీపావళికి వరుణ్ ముకుందుడిగా, సంక్రాంతికి పవన్ గోపాలుడిగా… ఫాన్స్‌కి పండగ సంబరాల్ని రెట్టింపు చేయడానికి వస్తున్నారు. ఈ సినిమాలన్నీ రొటీన్ మాస్ సినిమాలకి భిన్నంగా ఆహ్లాదకరమైన కథలతో కుటుంబ ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తున్నవి కావడం విశేషం.