ఆయన పాటల్లో ఆల్కహాల్‌ వుండి, కిక్‌నిస్తాయి

పాటలు లేని తెలుగు సినిమాను ఊహించుకోలేం. అసలు పాటలెందుకు పెడతారో తెలుగు వారు అని.. హాలీవుడ్‌ వాళ్ళకు ఇంకా ఆశ్చర్యం. మంచి పాటలు అందించి ఎంతో పేరు తెచ్చుకున్న భాస్కరభట్ల రవికుమార్‌ ఇప్పుడు లీడింగ్‌…

పాటలు లేని తెలుగు సినిమాను ఊహించుకోలేం. అసలు పాటలెందుకు పెడతారో తెలుగు వారు అని.. హాలీవుడ్‌ వాళ్ళకు ఇంకా ఆశ్చర్యం. మంచి పాటలు అందించి ఎంతో పేరు తెచ్చుకున్న భాస్కరభట్ల రవికుమార్‌ ఇప్పుడు లీడింగ్‌ రచయితల్లో ఒకరు. ఆయన పాటల్లో ఊపు వుండటానికి కారణం ఆల్కహాలు శాతం ఎక్కువని కొందరు కనిపెట్టేశారు.

‘గాల్లో తేలినట్టుందే..’ పాటలో ఫుల్‌ బాటిలెత్తి దించకుండా తాగినట్లుందే.. అంటూ ఫుల్‌ బాటిల్‌ని పాటలో కలిపి కిక్‌ ఇచ్చేలా చేశాడు. ఈయన్ని చూసి రామజోగయ్య శాస్త్రి కూడా ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ‘అమ్మో.. బాపుగారి బొమ్మో.. అమ్మో.. ఓల్డ్‌ మంకు రమ్మో..’ అని రాశాడు. పాటల్లో మొట్టమొదట ఆల్కహాలు కలిపిన ఘనత మాత్రం భాస్కరభట్ల రవికుమార్‌కే దక్కుతుంది. కాబట్టి ఇకముందు కూడా మందు కలిపిన పాటలు రావాలని ఆశిద్దాం.