రజనీకాంత్ ‘లింగ’ చిత్రాన్ని కొనేందుకు బయ్యర్లు వెనుకాడుతున్నారని, ఈ చిత్రానికి పెద్దగా హైప్ లేకపోవడంతో ‘లింగ’ని కొనేందుకు ఎవరూ ముందుకి రావడం లేదని గుసగుసలాడుకున్నారు. తాము అడిగినంత ఇవ్వకపోవడంతో లింగ చిత్రాన్ని నైజామ్, కృష్ణ, నెల్లూరులో నిర్మాతలే స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. మిగిలిన చోట్ల బిజినెస్ క్లోజ్ అయింది.
దీనికి హైప్ లేదని అనుకున్న వారికి షాకిస్తూ ‘లింగ’ అడ్వాన్స్ బుకింగ్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రజనీకాంత్ అంటే ఏంటో చూపిస్తూ ఈ చిత్రానికి పెద్దగా ప్రచారం లేకపోయినా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో రన్ అవుతున్నాయి. ఈమధ్య కాలంలో జనం ఎగబడి చూసిన సినిమా లేక బాక్సాఫీస్ వెలవెలబోయింది. రజనీ రాకతో మళ్లీ కళ రావడం ఖాయమైంది.
ఇక్కడే ఇలా ఉంటే ఇక తమిళనాట పరిస్థితి ఎలా ఉందనేది ఊహించుకోవచ్చు. రజనీకాంత్ సినిమా చూసి నాలుగేళ్లు అయిపోవడంతో తమిళ తంబీలు ఎలాగైనా ఈ చిత్రాన్ని మొదటి రోజే చూసేయాలని పోటీ పడిపోతున్నారు. మల్టీప్లెక్సుల నిండా ఇదే సినిమా ప్రదర్శిస్తున్నా కానీ అన్నీ బుక్ అయిపోయాయి. రజనీ మేనియా అంటే ఏంటో ఇంకోసారి ప్రపంచానికి చాటిచెప్తోంది లింగ!