ఎన్టీఆర్‌ ఇరగదీసాడంట

ఎన్టీఆర్‌ చాలా మంచి డాన్సర్‌ అయినా కానీ ఈమధ్య ఎందుకో ఆకర్షణీయమైన డాన్సులు చేయకుండా… ఏవో తూ తూ మంత్రం డాన్సులేసి కానిచ్చేస్తున్నాడు. కానీ టెంపర్‌లో మాత్రం ఎన్టీఆర్‌ డాన్సులకి లోటుండదని అంటున్నారు. ఈ…

ఎన్టీఆర్‌ చాలా మంచి డాన్సర్‌ అయినా కానీ ఈమధ్య ఎందుకో ఆకర్షణీయమైన డాన్సులు చేయకుండా… ఏవో తూ తూ మంత్రం డాన్సులేసి కానిచ్చేస్తున్నాడు. కానీ టెంపర్‌లో మాత్రం ఎన్టీఆర్‌ డాన్సులకి లోటుండదని అంటున్నారు. ఈ చిత్రంలో ఏమి ఉన్నా లేకున్నా ఎన్టీఆర్‌ డాన్సులు మాత్రం పతాకస్థాయిలో ఉండాలని పూరి జగన్నాథ్‌ పట్టుబట్టి చేయిస్తున్నాడట. 

ఇందులో ఐటెమ్‌ సాంగ్‌ చేసిన విదేశీ మోడల్‌ నోరా ఫతేహీ అయితే ఎన్టీఆర్‌ డాన్సులు చూసి ఫిదా అయిపోయింది. తనంత తేలిగ్గా క్లిష్టమైన డాన్సులు చేసే వాడిని ఎక్కడా చూడలేదని ఆమె కితాబిచ్చింది. మామూలు వాళ్లు ఇలా కాంప్లిమెంట్‌ ఇస్తే పట్టించుకోనక్కర్లేదు. కానీ నోరా స్వతహాగా మంచి డాన్సర్‌. పలు రకాల డాన్సుల్లో నిష్ణాతురాలు. 

ఆమె కూడా ఫిదా అయిందంటే ఎన్టీఆర్‌ ఇందులో ఎలాంటి డాన్సులు చేసాడనేది మీ ఊహలకే వదిలేస్తున్నాం. ఎన్టీఆర్‌ ఇటీవలి చిత్రాలు కమర్షియల్‌గా నెక్స్‌ట్‌ లెవల్‌కి చేరుకోకపోవడానికి డాన్సుల పరంగా ఎన్టీఆర్‌ డిజప్పాయింట్‌ చేయడం కూడా ఒక కారణంగానే చెప్తున్నారు. అతను డాన్సులు బాగా చేస్తే ఫాన్స్‌ తరఫున రిపీట్‌ వేల్యూ పెరిగి సినిమా రేంజ్‌ దానంతట అదే పెరుగుతుందిగా మరి.