శంకర్ విజువల్ ట్రీట్ ఐ సినిమా సంక్రాంతి విడుదల కూడా సందేహంలో పడింది. ఇంకా గ్రాఫిక్ పనులు చాలా పెండింగ్ లో వున్నాయని వినికిడి. దర్శకుడు శంకర్ అస్సలు ఈ విషయంలో రాజీ పడడం లేదు. దాంతో సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు చాలా నిదానంగా సాగుతున్నాయట.
నిజానికి తమిళ సినిమాలకు ఇటు దీపావళి, అటు సంక్రాంతి రెండూ మంచి సీజన్లు. ఈ రెండింటినీ మిస్ కావడం అంటే కాస్త విచారకరమే. ఇక మిగిలింది ఉగాది. అంటే మార్చి చివర లేదా ఏప్రిల్ ప్రారంభం. అప్పటిదాకా అవసరం లేదని జనవరి చివరికే సినిమా రెడీ అయిపోతుందని తెలుస్తోంది.
కానీ తెలిసినా ఫిబ్రవరి అన్నది ఇలాంటి సినిమాలకు అంతగొప్ప సీజన్ కాదు. వేసవి సెలవుల ముందు వస్తే, ఆ కంటిన్యూటీ అలా అలా వుంటుంది. అందువల్ల అంతవరకు వుంచుతారా..ఫిబ్రవరిలో వదిలేస్తారా అన్నది చూడాలి.
ఇదిలా వుంటే ఫ్రిబ్రవరిలో వదిల్తే బన్నీ-త్రివిక్రమ్ సినిమాను అందుకు అనుగుణంగా మార్చుకోవాలి. లేదూ వేసవికి వస్తే, రాజమౌళి బాహుబలి వుంటుంది.