గోపాలుడికి ఎన్నిపాటలు?

గోపాల గోపాల…సంక్రాంతికి మళ్లీ మరో మల్టీస్టారర్. వెంకటేష్, పవన్ కళ్యాణ్. బాలీవుడ్ హిట్ మూవీ ఓ మై గాడ్ కు తెలుగు అనువాదం.అన్నీ తెలిసిన సంగతులే.అయితే ఇంతకీ ఈ సినిమాలో పాటలు ఎన్ని వుండొచ్చు?…

గోపాల గోపాల…సంక్రాంతికి మళ్లీ మరో మల్టీస్టారర్. వెంకటేష్, పవన్ కళ్యాణ్. బాలీవుడ్ హిట్ మూవీ ఓ మై గాడ్ కు తెలుగు అనువాదం.అన్నీ తెలిసిన సంగతులే.అయితే ఇంతకీ ఈ సినిమాలో పాటలు ఎన్ని వుండొచ్చు? హిందీ సినిమాలో పాటలు, రిపీట్ లు, సౌండ్ ట్రాక్ లు, బిట్లు అన్నీ కలిపి డజను దాకా వుంటాయి. 

తెలుగు సినిమాలో కూడా అన్ని వుంటాయా అన్నది ఇప్పుడు సందేహం. సాధారణంగా హిట్ సినిమాలకు జిరాక్స్ లు అందిస్తారు కాబట్టి, అన్నీ వుంటాయి అనుకోవాలి. కానీ టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం పాటలను బాగా ట్రిమ్ చేసినట్లుతెలుస్తోంది. 

కేవలం మూడు పాటలే వుంచి, మిగిలినవి చిన్న చిన్న బిట్ లుగా సరిపెట్టినట్లు తెలుస్తోంది. పవన్-వెంకీల మీద ఓ పాట అయితే మాత్రం గ్యారంటీ.