ఆ క్యారెక్టర్‌ డిజైనే అంత.. నేనేం చేయను?

ఆర్టిస్టులు ఒక్కోసారి వేశ్యలా నటించాల్సి వుంటుంది. అంతమాత్రాన వాళ్ళు వేశ్యలైపోరు కదా. గతంలో అనుష్క కూడా అలాంటి పాత్ర చేసింది. ఇప్పుడు నేను చేస్తున్న యాంకరింగ్‌ అలాంటిదే అంటుంది వేడి వేడి యాంకర్‌ అనసూయ.…

ఆర్టిస్టులు ఒక్కోసారి వేశ్యలా నటించాల్సి వుంటుంది. అంతమాత్రాన వాళ్ళు వేశ్యలైపోరు కదా. గతంలో అనుష్క కూడా అలాంటి పాత్ర చేసింది. ఇప్పుడు నేను చేస్తున్న యాంకరింగ్‌ అలాంటిదే అంటుంది వేడి వేడి యాంకర్‌ అనసూయ. బేసికల్‌గా అనసూయది సెక్సీ ఫిగర్‌. గతంలో కూడా ఆమె యాంకరింగ్‌ హిట్‌ అవడానికి కారణం అదే. 

ఇప్పుడు ‘అలీ టాకీస్‌’ అనే ప్రోగ్రామ్‌లో అనసూయ అలీ వైఫ్‌గా ఎంట్రీ ఇచ్చి కామెడీ పండిస్తుంది. అయితే ఆ పాత్ర భర్త ఎదురుగానే పర పురుషుల కోసం వెంపర్లాడే విధంగా వుంటుంది. గెస్ట్‌లుగా వచ్చే కుర్ర హీరోల మీద పడిపోయే క్యారెక్టర్‌ అనసూయది.

అలాంటి యాంకరింగ్‌ చేయడం వల్ల మీకు ఇబ్బందిగా లేదా.? మీ గురించి ఇంకోలా అనుకోరా.? అని అడిగితే, ‘అయ్యో రామా.. ఆ పాత్ర డిజైనే అంత. దానికి నేను నటన జోడిస్తున్నానంతే. అంతే తప్ప నా ప్రవర్తన అదే అనుకోవడం అవివేకం. నా లుక్‌, స్టయిల్‌ అలా వుండాలని చెప్పారు, చేస్తున్నాను.. దీని వల్ల నాకు ఎంతో పేరు వచ్చింది.. బ్యాడ్‌గా అయితే ఎవరూ నా దగ్గర ప్రస్తావించలేదు..’’ అని చెబుతున్న అనసూయ ఇప్పుడు సినిమాల్లోనూ బిజీ అయిపోతుందట.