అమ్మడి ఫీజు జస్టు కోటి

అంజలికి పెద్ద సంఖ్యలో ఆఫర్లు వచ్చి పడిపోవడం లేదు కానీ వచ్చిన ఆఫర్ల నుంచే బలంగా బాదేస్తోంది. ఈమధ్యే వచ్చిన ఆమె చిత్రం ‘గీతాంజలి’ చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ…

అంజలికి పెద్ద సంఖ్యలో ఆఫర్లు వచ్చి పడిపోవడం లేదు కానీ వచ్చిన ఆఫర్ల నుంచే బలంగా బాదేస్తోంది. ఈమధ్యే వచ్చిన ఆమె చిత్రం ‘గీతాంజలి’ చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ చిత్రంలో చెప్పుకోతగ్గ స్టార్లు ఎవరూ లేకపోవడంతో ఆ హిట్‌ క్రెడిట్‌ మొత్తం అంజలి అకౌంట్‌లోకి పోయింది. ఇప్పుడు దానిని క్యాష్‌ చేసుకునే పనిలో అంజలి బిజీగా ఉంది. 

స్టార్‌ హీరోల సరసన అవకాశాలు రాకపోయినా కానీ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్ని లాగగలదనే పేరు రావడంతో అంజలికి అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయిపోతున్నారు. ‘పిల్ల జమీందార్‌’ దర్శకుడు అశోక్‌ ‘భాగ్‌మతి’ అనే పేరుతో ఒక లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ప్లాన్‌ చేసాడు. వేరే హీరోయిన్‌ని అనుకున్నారు కానీ ఆమె డేట్స్‌ లేకపోవడంతో అంజలికి అవకాశమొచ్చింది. 

ఈ చిత్రంలో నటించడానికి అంజలి కోటి రూపాయల ప్యాకేజీ అడిగిందట. ఆమె తప్ప మరో ప్రత్యామ్నాయం లేక అంజలి అడిగిన కోటికి ఓకే చెప్పేసారట. స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు రాకపోయినా కోటి అందుకునే లెవల్‌కి చేరిందంటే అంజలి డిమాండ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.