మన డైరెక్టర్‌ని ఆడేసుకుంటున్నారు

తెలుగు సినిమాతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా… ఒక్కసారి డైరెక్షన్‌ మొదలెట్టాక నటన కూడా తగ్గించేసాడు. సరాసరి బాలీవుడ్‌కి ఎదిగిపోయిన ప్రభుదేవా అక్కడ రీమేక్‌ సినిమాల్తో మొదట్లో సక్సెస్‌ అయ్యాడు. అతని సినిమాలు సక్సెస్‌ అయినా…

తెలుగు సినిమాతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా… ఒక్కసారి డైరెక్షన్‌ మొదలెట్టాక నటన కూడా తగ్గించేసాడు. సరాసరి బాలీవుడ్‌కి ఎదిగిపోయిన ప్రభుదేవా అక్కడ రీమేక్‌ సినిమాల్తో మొదట్లో సక్సెస్‌ అయ్యాడు. అతని సినిమాలు సక్సెస్‌ అయినా కానీ ప్రభుదేవా దర్శకత్వ శైలిని విమర్శకులు చీల్చి చెండాడారు. పోకిరి, విక్రమార్కుడు చిత్రాల హిందీ రీమేక్స్‌ చూసిన తెలుగు వాళ్లు కూడా ప్రభుదేవాని తిట్టుకున్నారు. 

మొదట్లో కమర్షియల్‌ విజయాల్తో పాస్‌ అయిపోయినా కానీ ఇప్పుడు మాత్రం ప్రభుదేవా విమర్శకుల్ని తప్పించుకోలేకపోతున్నాడు. ‘ఆర్‌… రాజ్‌కుమార్‌’ తర్వాత అతని నుంచి వచ్చిన ‘యాక్షన్‌ జాక్సన్‌’ కూడా క్రిటిక్స్‌ నుంచి భయంకరమైన ఫీడ్‌బ్యాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం ఇంతవరకు కేవలం ఇరవై ఎనిమిది కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ తెచ్చుకుని డిజాస్టర్‌ అనిపించుకుంది. 

దీంతో ప్రభుదేవాని టార్గెట్‌ చేస్తూ బాలీవుడ్‌ విమర్శకులు ఓ రేంజ్‌లో విరుచుకుపడిపోతున్నారు. సాజిద్‌ ఖాన్‌లాంటి దర్శకులు ఇప్పటికే హిందీ సినిమాకి చాలా డ్యామేజ్‌ చేస్తున్నారని, ప్రభుదేవా తీసే నాసి రకం ఎనభైల నాటి సినిమాలు ఇక ఇక్కడ అక్కర్లేదని, అతడిని బాలీవుడ్‌ నుంచి తరిమి కొట్టాల్సిన తరుణం వచ్చేసిందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుదేవాకి కొత్త అవకాశాలు రావడం కూడా కష్టమేనంటున్నారు.