సోనాక్షి తెలుగు సినిమాల్లో నటిస్తుందా.?

బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్‌ సినిమాల్లోకి ‘లింగా’ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. సినిమా ప్రమోషన్‌ కోసం సోనాక్షి హైద్రాబాద్‌ కూడా వచ్చింది. ‘దబాంగ్‌’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి, ఇప్పుడు బాలీవుడ్‌లో…

బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్‌ సినిమాల్లోకి ‘లింగా’ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. సినిమా ప్రమోషన్‌ కోసం సోనాక్షి హైద్రాబాద్‌ కూడా వచ్చింది. ‘దబాంగ్‌’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి, ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్ల లిస్టులో కొనసాగుతోన్న విషయం విదితమే.

ఇక, సోనాక్షి తెలుగు సినిమాల్లో నటించే విషయమై క్లారిటీ ఇవ్వడంలేదు. గతంలోనే ఓ నిర్మాత సోనాక్షిని సంప్రదిస్తే, ఆమె ‘ఇప్పట్లో సౌత్‌లో నటించాలనే ఆలోచన లేదు’ అని తెగేసి చెప్పిందట. పైగా, తన రెమ్యునరేషన్‌ బాలీవుడ్‌లో చాలా ఎక్కువ అనీ, దాన్ని సౌత్‌ భరించగలదా.? అని ప్రశ్నించిందనీ, ఆ సౌత్‌ నిర్మాత ఓ తెలుగు సినీ ప్రముఖుడనీ అప్పట్లో ఊహాగానాలు విన్పించాయి.

బాలీవుడ్‌లో హీరోయిన్లకు రెమ్యునరేషన్‌ ఎక్కువే. సౌత్‌లోనూ ఈ మధ్య రెమ్యునరేషన్‌ విషయంలో హీరోయిన్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనాక్షి నటిస్తానంటే, ఆమె అడిగినంత కాకపోయినా, ఇప్పటిదాకా ఏ హీరోయిన్‌ సౌత్‌లో అందుకోనంత పెద్ద అమౌంట్‌ ఆమెకు దక్కే అవకాశం వుంది. మరి, ‘లింగా’తో సౌత్‌ ఎంట్రీ ఇస్తోన్న సోనాక్షి తెలుగు సినిమాల్లోనూ నటించనుందా.? ఆమెకు అంత పెద్ద ఆఫర్‌ ఇచ్చే టాలీవుడ్‌ నిర్మాత ఎవరవుతారు.? వేచి చూడాల్సిందే.