జగన్ దీక్షకు… ప్రవాస భారతీయులు సంఘిభావము!

వాషింగ్టన్ డి సి: అక్టోబర్ 10: అమెరికాలోని తెలుగు ప్రవాస భారతీయులు పార్టీలకతీతంగా ముక్త కంఠంతో వాషింగ్టన్ డి సి లింకన్ మెమోరియల్ వద్ద ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో  గుంటూరు నల్లపాడు…

వాషింగ్టన్ డి సి: అక్టోబర్ 10: అమెరికాలోని తెలుగు ప్రవాస భారతీయులు పార్టీలకతీతంగా ముక్త కంఠంతో వాషింగ్టన్ డి సి లింకన్ మెమోరియల్ వద్ద ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో  గుంటూరు నల్లపాడు దీక్షాస్థలిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రతిపక్షనాయకుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి తమ  పూర్తి సంఘీభావము తెలిపారు.

ఈ ధర్నాను  సురేంద్ర రెడ్డి బతినపట్ల, వైఎస్సార్సీపీ సెంట్రల్ రీజినల్ కోఆర్డినేటర్ మరియు రమేష్ రెడ్డి వల్లూరు, వైఎస్సార్సీపీ అడ్వ్య్‌సర్  & మిడ్ అట్లాంటిక్ రీజినల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో, వాషింగ్టన్ డి సి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోర్ కమిటి సభ్యుల చేయూతతో కార్యక్రమం విజయవంతం చేసారు. 

విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు మన్మోహన్ సర్కార్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని, ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వం నెరవేర్చాలనీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని 19 నెలలు గడచినా, నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడం దారుణమని నినదిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ డి సి లింకన్ మెమోరియల్ వద్ద నిశ్సబ్ధ ధర్నా చేసారు. .

 రమేష్ రెడ్డి వల్లూరు మాట్లాడుతూ ముఖ్యంగా హోదా అన్నది కేంద్రం ఇచ్చే భిక్ష కాదని, అది మన హక్కు అని నాడు దేవేదేవుడు తిరుపతి శ్రీ బాలాజీ సమక్షంలో మాటానిచ్చిన నరేంద్ర మోడీ గారిని అక్టోబర్ 22 న ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించి భారతీయ చరిత్ర పుటలలో సజీవంగా నిలిచిపోవాలని కోరుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, ప్యాకేజీ రెండు అవసరమేనని, ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కుని, ప్యాకేజీ విభజన చట్టంలోనే ఉందని తెలిపారు.   

సురేంద్ర రెడ్డి బతినపట్ల మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చే వరకు అమెరికాలోని తెలుగు ప్రజలు విశ్రమించబోరని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోరాడుతామని  స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న మన నేత వైెఎస్ జగన్ బాటలో నడిచి, ఈ నెల 07 నుంచి మొదలయిన  నిరవధిక నిరాహార దీక్షకు  సంఘీభావం తెలుపుతు, రాష్ట్రానికి ప్రత్యేకహోదా తేసుకువచ్చే నాయకుడు యువనేత శ్రీ వైయస్‌ జగన్‌ ఒక్కరే అని వారు ధీమాగా పేర్కొన్నారు.

మన మనస్సులో చెరగని ముద్ర వేసిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డిగారు దార్శనికతకు అనుగుణంగా జననేత వైఎస్‌ జగన్మోహన రెడ్డి మార్గ నిర్దేషణలో అమెరికాలో ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాలను చేపట్టడానికి మనమంతా వైయస్ఆర్ సీపీ వెంట నడవాలని  పలువురు వక్తలు ప్రసంగిచారు.  

ఈ నిశబ్ధ ధర్నాకు  పెద్ద సంఖ్యేలో భారీగా వైఎస్సార్సీపీ ఎన్అర్ఐ నేతలు, పార్టీ శ్రేణులు,కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు, పార్టీలకతీతంగా ఈ ప్రాంతంలో నివసించే తెలుగు వారు వైఎస్ జగన్ కు తోడుగా వెన్నంటే ఉంటామని ప్రత్యేకహోదా ఆవశ్యకతను చాటి చెప్పారు.    

ఆంధ్రుల హక్కు ప్రత్యేకహోదా ఇది వైఎస్ జగన్ తోనే సాధ్యమని అలుపెరుగని యోధుడు, నిరంతరము ప్రజల వెన్నంటే ఉంటూ ఒక వైపు ఆరోగ్యం క్షీణిస్తున్నా, అంతా వారిస్తున్నా వినకుండా నమ్ముకొన్న జనం కోసం నమ్మకంగా దీక్ష చేస్తున్న జన నేత వైఎస్ జగన్ అని కొనియాడారు.  

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి.. కనీసం ప్రస్తావించడానికి కూడా భయపడుతూ పాటించే ఈ మౌనమే రాష్ట్రానికి శాపంగా మారుతోంది. చంద్రబాబు రాష్ట్రానికి తన వైఖరి ఎంత కీడు చేస్తున్నదో తెలిసే రోజు అతి తొందరలో ఉంది. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం చేసిందని అనకుండా చంద్రబాబు ఉండగలరా అని ఆయన ఒక సారి తన ఆత్మసాక్షిని ప్రశ్నించుకోవాలని పలువురు ప్రస్తావించారు. రుణమాఫీ మోసం, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగ భూతం కోరల్లో చిక్కి కుదేలవుతున్న యువత నిరాశలో కూరుకుపోయిన ప్రజానీకం, ఇవేవీ పట్టని ప్రభుత్వం సింగపూర్ జపాన్ అంటూ ఆరచేతిలో స్వర్ఘం చూపిస్తున్నారని చెప్పారు. హోదా ఇవ్వకపోతే ఎన్నికలు ఎప్పుడొచ్చినా అడ్రస్ కూడా లేకుండా పోతారని టీడీపీ, బీజేపీ నాయకులను హెచ్చరించారు.      
                              
నరేంద్ర మోడీ కనుసన్నల్లో నడుస్తోన్న ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం, ప్రత్యేక హోదా విషయంలో ప్రజల్ని మభ్యపెడుతూ, నరేంద్రమోడీని వెనకేసుకొస్తున్న వైనాన్ని జనం గమనిస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా డిమాండ్ విషయంలోనూ రాజకీయ పార్టీలకన్నా విద్యార్థి లోకమే ఎక్కువ శ్రద్ధ చూపెడుతోందన్నది కాదనలేని వాస్తవం అని అమెరికాలో చదువుతున్న పలువురు విద్యార్థులు ఈ ధర్నాలో పాల్గొని రుజువు చేసారు. ప్రత్యేకహోదా ఆకాంక్షను వ్యక్తపరుస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు వైఎస్ జగన్ కోసం గొంతెత్తి నినదిస్తున్నారని  తెలిపారు. వైఎస్ జగన్ దీక్ష విజయవంతం కావాలని, వైఎస్ జగన్ ఆరోగ్యం బాగుండాలని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలని మనస్పూర్తిగా ఆశించారు. వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష 5కోట్ల ప్రజల గుండెల్లో స్ఫూర్తినింపిందని ముక్త ఖంటంతో కొనియాడారు. 

ఇండియా నుంచి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శ్రీ విజయ సాయి రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి, శ్రీ అంబటి రాంబాబు గారు, అధికార ప్రతినిధి,  శ్రీ గుడివాడ అమర్ గారు, వైజాగ్ ఇన్ ఛార్జ్, శ్రీ డాక్టర్.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, MLA – చంద్రగిరి, మరియు శ్రీ గొట్టిపాటి రవికుమార్, MLA – అద్దంకి, ప్రత్యేక హోదా ఆవశ్యకతను కాన్ఫరెన్స్ కాల్ ద్వారా వివరించారు.                          

ఈ ధర్నాకు పలు రాష్ట్రాలనుంచి ముఖ్యంగా వైఎస్సార్సీపీ కోకన్వీనర్ రత్నాకర్ పండుగాయల (కనెక్టికట్), వైఎస్సార్సీపీ స్టూడెంట్ వింగ్ సభ్యులు సాత్విక్ రెడ్డి గోగులమూడి (న్యూ జెర్సీ), నాగ ప్రదీప్ (కనెక్టికట్), వికాస్ (టెక్సాస్), వినీల్ (కనెక్టికట్),స్వరూప్ సిలాస్ (కనెక్టికట్), కార్తీక్(టెక్సాస్), జగదీష్ (కనెక్టికట్) పాల్గొన్నారు.
                   
ఈ ధర్నా కార్యక్రమంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ సురేంద్ర రెడ్డి బతినపట్ల, వైఎస్సార్సీపీ అడ్వ్య్‌సర్ & రీజినల్ కోఆర్డినేటర్  రమేష్ రెడ్డి వల్లూరు, వైఎస్సార్సీపీ కోకన్వీనర్ రత్నాకర్ పండుగాయల, వైఎస్సార్సీపీ కోర్ కమిటి సభ్యులు కిరణ్ ముక్తాపురం, రాంగోపాల్ దేవపట్ల, ప్రసన్న కాకుమాని, విజయ్ పొలం, కిరణ్ ముక్తాపురం, రాంగోపాల్ దేవపట్ల, అమర్ కటికరెడ్డి, నినాద్ అన్నవరం, రాజా రెడ్డి నలవల, శశాంక్ ఆరమడక, వైఎస్సార్సీపీ మేరీల్యాండ్ సభ్యులు నరసా రెడ్డి, సుదర్శన్ దేవిరెడ్డి, తిప్పా రెడ్డి కోట్ల, వెంకట్ రెడ్డి ఎర్రం, బ్రంహ రెడ్డి, రాజశేఖర్, విశ్వ మోహన్ రెడ్డి, సోమ రామక్రిష్ణ రెడ్డి, వైఎస్సార్సీపీ వర్జీనియా సభ్యులు నరేంద్ర రెడ్డి ఏలూరు, సత్య అర్ పాటిల్, నాగరాజు కుందేటి, గోపాల్, సురేంద్రనాథ్, జనార్ధన్ జంపాల, ఏ బి శ్రీనివాస రెడ్డి, శ్రీని సిద్దినేని, అంజి, చిన్ని క్రిష్ణ,  నవీన్, నరసింహ రెడ్డి, రామ రెడ్డి, శ్రీధర్ రెడ్డి కాకూరు, శ్రీనివాసులు రెడ్డి, అనిల్ రెడ్డి, జయరాం, శశాంక్ రెడ్డి కందుకూరు, నరసా రెడ్డి, రఘు నరాల, భాస్కర్ ఏటూరు, భాస్కర్, విశ్వ ఆలూర్, ప్రసాద్ కోచిరాల, మధు రెడ్డి దేవిరెడ్డి, రాజీవ్ రాజోలు, రాజశేఖర్‌ బసవరాజు, శ్రీధర్ నాగిరెడ్డి మరియు అనేకులు హాజరయ్యారు.