“జమైరాజా” అనే టివిషో బాగా పాప్యులర్. అందులో నటించే నటి నియాశర్మకు మంచి ఫాలోయింగూ ఉంది. ఇంకా ఆ ఫాలోయింగ్‌ను పెంచుకోవాలనుకుందో, యధాలాపంగానే చేసిందో తెలీదు గాని… ఈ చిన్నది ఓ చిలిపి పని చేసింది. అదేమిటంటే… తన సహనటి అయిన రెహనా మల్హోత్రాను ముద్దాడడం. అదేదో బుగ్గమీదో, చేతిమీదో అయితే చర్చా లేదు రచ్చా లేదు. బహుశా అలా ఉండదనేమో… ఏకంగా నోట్లో నోరు పెట్టి ముద్దు పెట్టేసింది. అంతేకాదు తమ మధ్య ఉన్న అనుబంధానికి గుర్తుగా దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
కొన్ని రోజుల క్రితం నియా, రెహానాలు లిప్ కిస్ ఇచ్చుకుంటున్న ఒక ఫోటో బయటపడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వాళ్లిద్దరి మధ్యా ఉన్న స్నేహం సంగతి పక్కనపెట్టేసిన మీడియా లెస్బియన్ కిస్ అంటూ ప్రచురణలకు, ప్రసారాలకు దిగింది.
మీడియా ఇచ్చిన ఈ ట్యాగ్ సైతం విమర్శలకు వాదోపవాదాలకు తావిచ్చింది. ఇద్దరు ఫ్రెండ్స్ కిస్ ఇచ్చుకుంటే వాళ్లపై లెస్బియన్ అనే ముద్ర వేసేయడమేనా? అంటూ పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇద్దరు స్వంత వ్యక్తిత్వాలున్న, కెరీర్లో రాణిస్తున్న అమ్మాయిలు తమ మధ్య ఉన్న ప్రేమానుబంధాల్ని బహిరంగంగా ప్రదర్శించుకుంటే అందులో తప్పేం ఉందన్నారు.
మొత్తానికి తమ ముద్దు పై చర్చ హద్దులు దాటుతోందని గుర్తించిన నియా ఇది అర్ధం పర్ధం లేని వివాదం అంటూ తేల్చేసింది. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని దీన్ని భూతద్దంలో చూడొద్దంది. అయినా ముద్దు గొడవ ఆగకపోవడంతో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి సదరు ఫొటోని డిలీట్ చేసేసింది. తాము లెస్బియన్స్ కాదు అని స్పష్టంగా చెబుతున్నాం మొర్రో అంటూ నియా మొత్తుకుంది. అయితే రెహనా మాత్రం తాజా ప్రకటనలో తీవ్రంగా స్పందించింది.
“నాకు నీతులు చెప్పొద్దు. నాకు నచ్చింది నేను చేస్తాను. నేను నా గాళ్‌ఫ్రెండ్స్‌ను ముద్దెట్టుకుంటాను. నాకు నచ్చినట్టు దుస్తులు ధరిస్తాను. నా సన్నిహితులు, నాకు కావల్సినవారు నా ప్రవర్తన పట్ల సంతోషంగా ఉంటే చాలు. మీరెవరు నా జీవితంలో జోక్యం చేసుకోవడానికి (ఇక్కడో బూతు పదం కూడా ప్రయోగించింది) ఇద్దరు అమ్మాయిలు తమ మధ్య ఉన్న ప్రేమను తమకు నచ్చినట్టు ప్రదర్శించుకోకూడదా? లెస్బియన్ మాత్రమే ఇలాంటి కిస్ ఇస్తుందా? అనుబంధాలను ప్రదర్శించుకోవడం అనేది మనం మర్చిపోతున్నామా? ఇప్పటికీ ఇద్దరమ్మాయిల మధ్య ముద్దు అనేది ప్రపంచానికి ఇంత పెద్ద విషయమా?” అంటూ ప్రశ్నలతో మండిపడింది.
చివరకి తేలుతున్నదేమిటంటే… ఒకప్పుడు స్త్రీ పురుషులు మాత్రమే తాము సన్నిహితంగా ఉంటే దానికి కారణం ఇదంటూ ప్రపంచానికి వివరణ ఇచ్చుకోవలసి వచ్చేది. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్లను సైతం సన్నిహితంగా ఉంటే సందేహంగా చూడాల్సిన పరిస్థితి, వారు వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి. వచ్చేసింది.