ఛాన్స్ వస్తే ఆ హీరోయిన్ తో గడుపుతానంటున్న మహేశ్!

ఇటీవల ఒక ఛారిటీ కార్యక్రమంలో పాలుపంచుకొన్నాడు మహేశ్ బాబు. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో ఒక హై ఫై పీపుల్ తో ఒక చాట్ షోలో పాల్గొని ఆ షో ద్వారా…

ఇటీవల ఒక ఛారిటీ కార్యక్రమంలో పాలుపంచుకొన్నాడు మహేశ్ బాబు. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో ఒక హై ఫై పీపుల్ తో ఒక చాట్ షోలో పాల్గొని ఆ షో ద్వారా సమీకరణ అయిన డబ్బును చారిటీ కోసం వినియోగించారు. ఈ కార్యక్రమంలో మహేశ్ , నమ్రతలు పాల్గొన్నారు. మహేశ్ హాట్ సీట్ పై కూర్చొనగా.. ఈ కార్యక్రమానికి అనేక మంది హై సొసైటీ పీపుల్ హాజరై.. తమ ప్రశ్నలతో మహేశ్ ను పలకరించారు.

ఇలాంటి ప్రశ్నల్లో కొన్ని ఆసక్తికరమైనవి కూడా ఉన్నాయి. 'ఒకవేళ ఎవరైనా హీరోయిన్ తో డిన్నర్ చేసి.. ఒక మూడుగంటల సేపు సాన్నిహిత్యంగా గడిపే అవకాశం వస్తే.. మీరు ఎవరిని ఎంచుకొంటారు..?' అని ఆ కార్యక్రమంలో ఒక ప్రశ్న వినిపించింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మొదట సిగ్గుపడిన మహేశ్ బాబు ఆ తర్వాత మత్రం 'డెమీ మూర్' అని సమాధానం ఇచ్చాడు!

ఆ హాలీవుడ్ నటిపై ఆసక్తిని ప్రకటించుకొన్నాడు. సాన్నిహిత్యంగా గడపడటం అంటే.. ప్లెటోనిక్ లవ్ అనమాట. మరి ఇలాంటి బంధం విషయంలో మహేశ్  చాయిస్ 52 యేళ్ల హాలీవుడ్ నటి కావడం కచ్చితంగా విశేషమే. సరదాగా గడపడానికి ఏ తెలుగో, హిందీ హీరోయిన్ పేరో చెబుతాడనుకొంటే.. ఏకంగా హాలీవుడ్ నటీమణి పేరు చెప్పాడు మహేశ్. నటిగా అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఆమెను మహేశ్ మోహిస్తున్నట్టుగా ఉన్నాడు. ఎదురుగా నమ్రత ఉన్నప్పుడు మహేశ్ ఈ పేరు చెబితే.. ఆమె మాత్రం నవ్వుతూ ఉండిపోయింది!