ఇంతన్నాడంతన్నాడే..గంగరాజు అన్నట్లు డప్పేస్తున్నాడు వైవిఎస్ చౌదరి. రేయ్ సినిమా డ్రెస్ లకే రెండు కోట్లు ఖర్చు చేసానంటున్నాడు. సినిమాను భారీగా చూపించడంలో, భారీగా కబుర్లు చెప్పడంలో చౌదరికి సాటి లేరు. ఒక్కమగాడు..సలీం సినిమాలను జనం ఇంకా మర్చిపోలేదు.
రేయ్ కు అంత సీన్ వుంటే ఇంతకాలం డిక్కీలో ఎందుకుంటుంది? బయ్యర్లు వచ్చి ఎగరేసుకుపోరా?సినిమాలో అంత సత్తానే వుంటే మళ్లీ పవనిజం, అంటూ ఈ పక్క వాయిద్యాల గోల ఎందుకు? ఇంతకీ సినిమా విడుదల కన్ ఫర్మేనా అని హీరో సాయి ధరమ్ తేజను దగ్గరి జనాలు అడిగితే, విడుదలయితే కన్ ఫర్మ్ అనే అనుకుంటా అని సమాధానం ఇస్తున్నాడట.
చౌదరి ఈ సారి మిస్ కానివ్వనని అంటున్నాడని, అయినా విడుదలయితేనే..సరే అనుకుంటానని అంటున్నాడట.ఆ సినిమా విడుదల మీద సినిమా జనాలకే అంత నమ్మకం. సినిమా విడుదలవ్వాలి..బాగుండాలి. హిట్ కావాలి. అప్పుడు వినాలి చౌదరిగారి డప్పు.