క్వార్టర్స్‌లో బంగ్లాతో టీమిండియా ‘ఫైట్‌’.!

పూల్‌-ఎలో ఎవరు ఏ స్థానంలో వున్నారో తేలిపోయింది. పూల్‌-బిలో టాప్‌ ప్లేస్‌ టీమిండియాదే. పూల్‌-ఎలో వున్న బంగ్లాదేశ్‌ నాలుగో స్థానానికి పరిమితమైంది. దాంతో టీమిండియా – బంగ్లాదేశ్‌ మధ్య క్వార్టర్స్‌ మ్యాచ్‌ జరగనుండడం ఖాయమైపోయింది.…

పూల్‌-ఎలో ఎవరు ఏ స్థానంలో వున్నారో తేలిపోయింది. పూల్‌-బిలో టాప్‌ ప్లేస్‌ టీమిండియాదే. పూల్‌-ఎలో వున్న బంగ్లాదేశ్‌ నాలుగో స్థానానికి పరిమితమైంది. దాంతో టీమిండియా – బంగ్లాదేశ్‌ మధ్య క్వార్టర్స్‌ మ్యాచ్‌ జరగనుండడం ఖాయమైపోయింది. బంగ్లాదేశ్‌ అంటే పసికూన కిందే లెక్క. అలాగని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. 

టీమిండియాకి బంగ్లాదేశ్‌తో కొన్ని చేదు అనుభవాలైతే లేకపోలేదు. అలాగని, ఇప్పుడున్న టీమిండియా.. బంగ్లాదేశ్‌ ఆటగాళ్ళ దెబ్బకు భయపడ్తుందనీ అనుకోలేం. నాకౌట్‌ మ్యాచ్‌లు కావడంతో క్వార్టర్స్‌లో టీమిండియా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదన్నది సగటు భారత క్రికెట్‌ అభిమాని కోరిక. 

లీగ్‌ దశలో టీమిండియాకి ఇంకా ఓ మ్యాచ్‌ మిగిలే వుంది. ఆ ముచ్చటా రేపు తీరిపోతుంది. జింబాబ్వేతో జరగనుంది ఈ మ్యాచ్‌. ధోనీసేన ఇప్పటిదాకా లీగ్‌ దశలో ఏ టీమ్‌నీ లైట్‌ తీసుకోలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాకు తగ్గట్టుగానే ప్రతిభ కన్పించింది. టైటిల్‌ వేటలో భారత క్రికెటర్లు ఎంత కసిగా వున్నారో జరిగిన మ్యాచ్‌లన్నీ స్పష్టం చేసేశాయి.