పవన్ ఆమెను మర్చిపోలేదు

ఒకసారి నటించిన హీరోయిన్ ను ఇప్పటి హీరోలు టక్కున వదిలేస్తారు..మళ్లీ మరో అమ్మాయి కోసం చూస్తారు. ఇక ఫ్లాప్ సినిమాలో హీరోయిన్ అయితే అంతే సంగతులు. కానీ పవన్ మాత్రం అలా కానట్లుంది. ఏరి…

ఒకసారి నటించిన హీరోయిన్ ను ఇప్పటి హీరోలు టక్కున వదిలేస్తారు..మళ్లీ మరో అమ్మాయి కోసం చూస్తారు. ఇక ఫ్లాప్ సినిమాలో హీరోయిన్ అయితే అంతే సంగతులు. కానీ పవన్ మాత్రం అలా కానట్లుంది. ఏరి కోరి తనతో ఓ ఫ్లాప్ సినిమాలో జత కట్టిన అమ్మాయికి గబ్బర్ సింగ్ 2 తళుక్కున మెరిసే పాత్ర ఒకటి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. 

పులి సినిమాలో పవన్ తో నటించింది నికిషా పటేల్. ఇప్పుడు ఆమెను గబ్బర్ సింగ్ లో..కెవ్వు కేక..అనే టైపు అయిదు నిమషాల పాత్రకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటో పవన్ ఐడియాలు. ఎక్కడో చిన్న సినిమాలో చేసిన అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్ చేసాడు..ఇప్పుడిలా?