రెండు జెళ్ల సీత

వారసులు వచ్చారంటే సినిమాల్లో వారి పెద్దల పాటలు రీమిక్స్ చేసుకునే హక్క వచ్చేసినట్లే. అలాగే సినిమా టైటిళ్లు కూడా. బాల కృష్ణ చాలా సినిమాలకు ఎన్టీఆర్ సినిమా పేర్లు వాడేసారు. చరణ్ సినిమాల్లో చిరంజీవి…

వారసులు వచ్చారంటే సినిమాల్లో వారి పెద్దల పాటలు రీమిక్స్ చేసుకునే హక్క వచ్చేసినట్లే. అలాగే సినిమా టైటిళ్లు కూడా. బాల కృష్ణ చాలా సినిమాలకు ఎన్టీఆర్ సినిమా పేర్లు వాడేసారు. చరణ్ సినిమాల్లో చిరంజీవి పాటల రీమిక్స్ ల సంగతి తెలిసిందే. 

ఇప్పుడు సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ హీరోగా సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టైటిల్ గా జంధ్యాల దర్శకత్వం వహించిన నరేష్ సినిమా 'రెండు జెళ్ల సీత' పేరును ఖాయం చేసే ఆలోచనలో వున్నట్లు తెలిసింది. ఇటు యూత్ ఫుల్ గా వుంటుంది..తెలుగుదనం వుంటుంది..లవ్ లీ గా వుంటుందని యూనిట్ భావిస్తున్నట్లు బోగట్టా.