మొత్తం మీద ముందుగానే బోల్డ్ సినిమా అని చాటేయడంతో ఫ్యామిలీలకు కాస్త దూరమైన గాలిపటం సినిమా ఇప్పుడిప్పుడే సేఫ్ జోన్ లోకి వస్తోంది. సోమవారం నుంచి కాస్త స్టడీ అయిన సినిమాకు మొత్తం మీద అడియో, అదర్ ఏరియాలు, ఆంధ్ర, నైజాం, ఈస్ట్, వగైరా అన్నీ కలిపి మూడు కోట్లకు దాటి ఇప్పటి దాకా వచ్చినట్లు బోగట్టా. సినిమా అయిదు వరకు ఖర్చయింది. మరో రెండు వరకు రావాల్సి వుంది.
తెలంగాణలో భారీగా వరుస సెలవులు రావడం, సురేష్ ద్వారా విడుదల కావడంతో, సికిందర్ కోసం థియేటర్లు ఖాళీ చేయనక్కరలేకపోవడం వల్ల ఈ వారం కొంత వరకు సంపాదించుకునే అవకాశం వుందని నిర్మాణ వర్గాలు ధీమా పడుతున్నాయి. శాటిలైట్ డిస్కషన్లు మాటీవీతో జరుగుతున్నాయి. రెండు నుంచి రెండున్నర వరకు వస్తుందని ఆశ. రెండు వచ్చినా అసలు మేరకు గట్టెక్కేసినట్లే. సినిమాలో మరీ బోల్డ్ అనుకున్న టెర్రస్ సీన్, మేల్ ప్రాస్టిట్యూషన్ సీన్లను రెండో రోజే ట్రిమ్ చేయడం పనికి వచ్చిందని, మొత్తానికి మొదటి ప్రాజెక్టు ఏదో విధంగా గట్టెక్కేసినట్లే అని అంటున్నారు యూనిట్ జనాలు.