తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం రోజు రోజుకూ మెట్రో పోకడలు మరింతగా రంగరించుకుంటోంది. ముంబయి, ఢిల్లీ నగరాలతో పోటీపడుతూ హైదరాబాద్ నైట్ లైఫ్ ఉరకలెత్తుతోంది. పబ్ హెవెన్‌గా పేరున్న బెంగుళూరును సైతం తోసిరాజనే స్థాయిలో హైదరాబాద్‌లో పబ్స్ పెరిగిపోతున్నాయి.
తాజాగా శనివారం హైదరాబాద్‌లోని ది పార్క్ పబ్‌లో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్.. ఫుల్ హాట్ హాట్‌గా సాగింది. ముంబయి డిజైనర్లు ర్యాంప్ మీద మోడల్స్‌ని తమ డిజైన్లతో మెరిపించారు. ఈ సందర్భంగా మోడల్స్‌కి థీటుగా ఈ నైట్ ప్రోగ్రాంకి హాజరైన పేజ్ త్రీ పీపుల్, పార్టీ ప్రియులు… షార్ట్ డ్రెస్సులతో కుర్రకారు కిక్ పెంచారు.
దీంతో సిటీలోని మీడియా మొత్తం అక్కడే కొలువుదీరింది. నిర్విరామంగా కెమెరాలకు పనిపెట్టింది. ఏ అందాన్ని మిస్ అయిపోతామో అనేంత ఆతృత మీడియా ఫొటోగ్రాఫర్లలో కనిపించింది. ఈ తరహా ఈవెంట్లు జరిగినప్పుడల్లా పాసులు దొరకని వాళ్లు కాలుగాలిన పిల్లుల్లా ఆవరణ బయటే తిరగడం కూడా ఇప్పుడు హైదరాబాద్‌లో సహజం అయిపోయింది. శుక్రవారం ప్రారంభమై 3 రోజుల పాటు వరుసగా రాత్రి సమయంలో జరిగే ఈవెంట్‌ను నిర్వహించింది కింగ్ ఫిషర్ బీరు బ్రాండ్.
దాదాపు 40 మంది అందమైన మోడల్స్ పాల్గొన్న ఈ ఈవెంట్లో ర్యాంప్‌వాక్‌లు పూర్తయ్యాక ఆఫ్టర్ పార్టీ మరింత రంజుగా సాగింది. దీనిలోకి మీడియాను, కెమెరాలను అనుమతించరు. ఈవెంట్ స్పాన్సర్లు, సిటీకి చెందిన విభిన్న రంగాల సంపన్నులు మాత్రమే ఉంటారు.
ఏదేమైనా… ఈ తరహా ఈవెంట్లు హైదరాబాద్ కు ఆర్ధికంగా మేలు చేస్తాయని కొందరు, యువతను రాంగ్‌రూట్ పట్టించే ప్రమాదం ఉందని మరికొందరు వాదిస్తున్నా, వాటి దారిన అవి పెరిగిపోతూనే ఉన్నాయి. తప్పదు.. అభివృద్ధితో పాటు అన్నీ భరించాల్సిందే.