మహేష్‌ టార్గెట్‌ ఎంత?

పోకిరి తర్వాత మళ్లీ ఇండస్ట్రీ హిట్‌ కొట్టలేకపోయాడు మహేష్‌బాబు. ఈ ఎనిమిదేళ్లలో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి విజయాలు సొంతమైనా కానీ పోకిరిని బీట్‌ చేసిన మగధీరని అందుకోలేకపోయాడు మహేష్‌. అత్తారింటికి…

పోకిరి తర్వాత మళ్లీ ఇండస్ట్రీ హిట్‌ కొట్టలేకపోయాడు మహేష్‌బాబు. ఈ ఎనిమిదేళ్లలో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి విజయాలు సొంతమైనా కానీ పోకిరిని బీట్‌ చేసిన మగధీరని అందుకోలేకపోయాడు మహేష్‌. అత్తారింటికి దారేది వచ్చి మగధీర రికార్డుని బ్రేక్‌ చేయడంతో ఇప్పుడు మహేష్‌కి కొత్త టార్గెట్‌ సెట్‌ అయింది. 

మెగా హీరోలు విసిరిన ఈ ఛాలెంజ్‌ని మహేష్‌ ఈసారి స్వీకరిస్తాడా? ఆగడుతో అత్తారింటికి దారేది రికార్డులు కొల్లగొట్టి ఎనిమిదేళ్ల తర్వాత అగ్ర సింహాసనాన్ని తిరిగి కైవసం చేసుకుంటాడా? మహేష్‌ కెరీర్‌ బెస్ట్‌ హిట్‌ అయిన దూకుడు 56 కోట్ల షేర్‌ వసూలు చేసింది. ఇప్పుడు దీని కంటే పైన రేసుగుర్రం (58 కోట్లు), గబ్బర్‌సింగ్‌ (60 కోట్లు), మగధీర (72 కోట్లు), అత్తారింటికి దారేది (75 కోట్లు) ఉన్నాయి. 

వీటిలో మహేష్‌ ఎన్నిటిని అధిగమించబోతున్నాడు. ఈసారి తనకి ఫ్రీ స్పేస్‌ అయితే దొరకడం లేదు. అక్టోబర్‌ 1న గోవిందుడు అందరివాడేలే రిలీజ్‌ అవుతుంది కనుక ఆగడు అద్దిరిపోయే టాక్‌ని సొంతం చేసుకుంటే తప్ప ఇండస్ట్రీ రికార్డు సెట్‌ చేయడం సులభం కాదు. విపరీతమైన పోటీ మధ్యనే వచ్చి పోకిరితో ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు కనుక మహేష్‌కి పోటీలో పై చేయి సాధించడమూ కొత్త కాదు.