వరల్డ్‌ కప్‌.. నాకౌట్‌ అంత తేలిక కాదు.!

ఇప్పటిదాకా టీమిండియా వరల్డ్‌ కప్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ ఘనవిజయం సాధించింది. పూల్‌-బిలో టాప్‌ ప్లేస్‌లో వున్న టీమిండియా, బ్యాటింగ్‌ విభాగంతోపాటు, బౌలింగ్‌ విభాగంలోనూ స్ట్రాంగ్‌గా వుందనే చెప్పాలి. అయితే ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి…

ఇప్పటిదాకా టీమిండియా వరల్డ్‌ కప్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ ఘనవిజయం సాధించింది. పూల్‌-బిలో టాప్‌ ప్లేస్‌లో వున్న టీమిండియా, బ్యాటింగ్‌ విభాగంతోపాటు, బౌలింగ్‌ విభాగంలోనూ స్ట్రాంగ్‌గా వుందనే చెప్పాలి. అయితే ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన జట్లు, లీగ్‌ దశలో మ్యాచ్‌ మ్యాచ్‌కీ మరింత బలాన్ని పుంజుకోవడంతో 'నాకౌట్‌' పోటీలు నరాలు తెగే ఉత్కంఠను క్రియేట్‌ చేయడం ఖాయంగానే కన్పిస్తోంది. 

భారత బ్యాటింగ్‌ లైనప్‌ బాగానే వున్నా, మిగతా జట్లు మరింత బలాన్ని సంతరించుకుంటున్నాయి. శ్రీలంకనే తీసుకుంటే, ఆ జట్టు టాప్‌ ఆర్డర్‌ మునుపెన్నడూ లేనంత స్ట్రాంగ్‌గా వుంది. ఆస్ట్రేలియా సంగతి సరే సరి. సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ కూడా అంతే. బంగ్లాదేశ్‌ తానేం తక్కువ కాదంటోంది. పాకిస్తాన్‌ ఏ టైమ్‌లో ఎలా ప్రదర్శన ఇస్తుందో ఊహించుకోవడం కష్టం. 

నాకౌట్‌లో టీమిండియా ఎవరితో తలపడనుందన్నదానిపై దాదాపుగా స్పష్టత వచ్చేసింది. క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల్స్‌.. అన్నీ నాకౌట్‌ మ్యాచ్‌లే గనుక, ఏ మ్యాచ్‌నీ టీమిండియాగానీ, ఇతర జట్లుగానీ లైట్‌ తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పటిదాకా చూపించిన ప్రదర్శన ఒక ఎత్తు.. ఇప్పుడిక చూపించాల్సింది ఇంకో ఎత్తు. మరోమారు టైటిల్‌ విజేత అన్పించుకోవాలంటే, ఆల్‌రౌండ్‌ నైపుణ్యానికి టీమిండియా సిద్ధం కావాల్సిందే.