సమంత బొమ్మకి అన్ని కోట్లా?

‘రభస’ రిలీజ్‌ వాయిదా పడడంతో ‘సికిందర్‌’ పంట పండిరది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం ఆగస్టు 15న భారీ లెవల్లో విడుదల కానుంది. సూర్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి…

‘రభస’ రిలీజ్‌ వాయిదా పడడంతో ‘సికిందర్‌’ పంట పండిరది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం ఆగస్టు 15న భారీ లెవల్లో విడుదల కానుంది. సూర్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి తమిళనాడుతో పాటు ఆంధ్ర, తెలంగాణల్లో కూడా బిజినెస్‌ బాగా జరిగింది. 

తమిళనాడులో 37 కోట్ల బిజినెస్‌, ఆంధ్ర`తెలంగాణలో 13 కోట్ల బిజినెస్‌ చేసిన ఈ చిత్రానికి రెండు భాషల్లో శాటిలైట్‌ రైట్స్‌ రూపంలోనే 19 కోట్లు (తమిళ శాటిలైట్‌ రైట్స్‌ 16 కోట్లు) వచ్చాయి. ఇక ఓవర్సీస్‌లో కూడా తమిళ చిత్రాలకి గిరాకీ బాగుంది కనుక అక్కడా ‘అంజాన్‌’కి పది కోట్ల బిజినెస్‌ జరిగింది. టోటల్‌గా అన్ని హక్కులు కలుపుకుని ఈ చిత్రానికి 87 కోట్ల బిజినెస్‌ జరిగిందని అంచనా. 

తెలుగు మార్కెట్‌ అడ్వాంటేజ్‌ వల్ల ఈ చిత్రానికి పదహారు కోట్ల బూస్ట్‌ దక్కింది. అలా చూసుకున్నా కానీ ఈ చిత్రానికి కేవలం తమిళ వెర్షన్‌తోనే 70 కోట్ల పైగా బిజినెస్‌ జరిగింది. తెలుగు సినిమా మార్కెట్‌తో పోలిస్తే తమిళ చిత్రాలు ఎక్కడ స్కోర్‌ చేస్తున్నాయనే దానికి ఇది చక్కని కేస్‌ స్టడీగా పనికొస్తుంది. శాటిలైట్‌ ప్లస్‌ మ్యూజిక్‌ రైట్స్‌ మినహాయిస్తే రెండు భాషల్లో కలిపి ఈ చిత్రం 67 కోట్ల బిజినెస్‌ చేసింది. మరి రెండు భాషల్లోను ఉమ్మడిగా 70 కోట్ల షేర్‌ సాధించి ఈ చిత్రం హిట్‌ అనిపించుకుంటుందా?