రభస ఇంకా డౌటా?

ఇంకా ఎక్కడ 29వ తేదీ..15రోజులకు పైనే వుంది. సినిమా జనాలకు ఇది తక్కువ సమయమేమీ కాదు. చకచకా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమాను తెరపైకి తెచ్చేయగల సమర్థులు. అయినా కూడా ఇంకా…

ఇంకా ఎక్కడ 29వ తేదీ..15రోజులకు పైనే వుంది. సినిమా జనాలకు ఇది తక్కువ సమయమేమీ కాదు. చకచకా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమాను తెరపైకి తెచ్చేయగల సమర్థులు. అయినా కూడా ఇంకా టాలీవుడ్ జనాలు అక్కడక్కడ రభసకు చాలా పనులు పెండింగ్ లో వున్నాయి..పదిహేను రోజులు చాలవు అంటున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. 

నిర్మాణ వర్గాలు మాత్రం ఈ విషయంలో చాలా ధీమాగా వున్నట్లు వినికిడి. నిజానికి 15నే రభస రావాల్సింది. కానీ వాయిదా పడింది. దీనిపై రకరకాల వార్తలు వచ్చాయి. కొడుకు సినిమా కోసం బెల్లంకొండ రభసను వెనక్కునెట్టాడని అక్కడక్కడ వినిపించింది. అదే నిజమైతే సినిమా 15కే రెడీ అయిపోయినట్లు కదా..అందువల్ల 29 నాటికి రావడానికి మరే అడ్డంకి వుండదు. 

అలా కాదు. పనులు పెండింగ్ వున్నాయి. వాటిని చకచకా చేస్తున్నారు అన్నమాట నిజమైతే కొడుకు కోసం వాయిదా అన్నది సరికాదన్నమాట. సికిందర్, పవర్ , రభస సినిమాల వల్ల చాలా చిన్న సినిమాల తేదీలు అలా ఆగిపోయాయి. రభస సంగతి తేలితే 22, 29ల్లో పిట్టలు రాలినట్లు చాలా చిన్న సినిమాలు రాలతాయి. లేదూ రభస కన్ ఫర్మ్ అంటే అవి అలా పెండింగ్ లో వుంటాయి.