వాల్తేర్ వంశీ ప్రకాష్ రాజ్?

శివమణి సినిమాలో పూర్ణ మార్కెట్ దత్తు గుర్తున్నాడా? ఇప్పుడు మళ్లీ అలాంటి క్యారెక్టర్ వచ్చింది ప్రకాష్ రాజ్ కు. అది కూడా పూరి జగన్నాధ్ సినిమాలోనే..జూనియర్ ఎన్టీఆర్ తో నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న…

శివమణి సినిమాలో పూర్ణ మార్కెట్ దత్తు గుర్తున్నాడా? ఇప్పుడు మళ్లీ అలాంటి క్యారెక్టర్ వచ్చింది ప్రకాష్ రాజ్ కు. అది కూడా పూరి జగన్నాధ్ సినిమాలోనే..జూనియర్ ఎన్టీఆర్ తో నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న టెంపర్ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పేరు వాల్తేర్ వంశీ అని విశ్వసనీయంగా తెలిస్తోంది. 

విశాఖ నేపథ్యంలో దందాలు చేసే క్యారక్టర్. విశాఖ అంటే మహా ఇష్టం దర్శకుడు పూరికి. అందుకే మళ్లీ చాన్నాళ్లకు విశాఖ నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. అయితే షూటింగ్ అంతా గోవాలో అనుకోండి.  పేరుకే విశాఖ నేపథ్యం. 

ఇదిలా వుంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ కరెప్టెడ్ పోలీస్ అధికారి, పాజిటివ్ గా మారడం, ఆ తరువాత జరిగే దాగుడుమూతలు కథాంశంగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ స్టిల్స్ సినిమా టెంపర్ ను పెంచేసాయి. సినిమా పేరు జనాల్లోకి పాకిపోయింది. 

అందువల్ల ఎన్టీఆర్ పొలీస్, ప్రకాష్ రాజ్ విలన్ అంటే సినిమా ఓ లెక్కలో వుంటుదని అంచనా వేస్తున్నారు. అందునా ఫస్ట్ పార్ట్ లో ఏరోగెంట్, కరెప్టెడ్ పోలీస్ అధికారి క్యారెక్టర్ అంటే ఇక పూరి దున్నేస్తాడు కూడా.