అప్పుడు మాట..ఇప్పుడు చేత

విక్టరీ వెంకటేష్ తన స్థలంలో అక్రమ షెడ్ ను స్వయంగా దగ్గర వుండి కూల్చివేయించారు. బాగానే వుంది. అయితే అంతకు ముందు సీన్ వేరుగా వుంది. జిహెచ్ఎంసి నోటీస్ ఇచ్చినపుడు, తాను దాన్ని వేరేవాళ్లకు…

విక్టరీ వెంకటేష్ తన స్థలంలో అక్రమ షెడ్ ను స్వయంగా దగ్గర వుండి కూల్చివేయించారు. బాగానే వుంది. అయితే అంతకు ముందు సీన్ వేరుగా వుంది. జిహెచ్ఎంసి నోటీస్ ఇచ్చినపుడు, తాను దాన్ని వేరేవాళ్లకు లీజ్ కు ఇచ్చానని, తనకు సంబంధలేదని కొన్ని డక్యుమెంట్లు కూడా చూపించారు. ఇలా నోటీస్ ఇవ్వగానే అలా సమాధానం ఇచ్చారు వెంకటేష్. 

మరి ఇప్పుడేమయిందో తెలియదు కానీ, తానే దగ్గర వుండి కూలగొట్టించారు. అంటే లీజ్ కు ఇచ్చినా తనదే బాధ్యత అని తెలిసిందా లేక, తెరాస ప్రభుత్వంతో అనవసరపు తగాయిదా ఎందుకని అనుకున్నారా? అసలే ఇటీవల వెంకీ అన్న సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఫంక్షన్ కు తెలంగాణకు చెందిన ఏ ఒక్క అధికార ప్రముఖుడిని ఆహ్వానించలేదని గుసగుసలు వినిపించాయి. 

అవును అన్నీ బాగున్నాయి. అసలు ఫిల్మ్ నగర్ సైట్ల నియమ నిబంధనలేమిటి? అది ఫిల్మ్ నగర్ సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన స్థలం కదా. బహుశా అప్పట్లో ఏదో రేటుకు ప్రభుత్వం ఇచ్చి వుంటుంది. దానికి అంటూ కొన్న విధి విధానాలు అంటూ వుంటాయేమో? అందులో ఏమున్నాయో?