సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా లింగా. అందునా కేఎస్ రవికుమార్ డైరక్టర్. దాంతో మరింత క్రేజీ ప్రాజెక్టుగా మారింది. ఈ సినిమా మీద నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ చాలా ధీమాగా వున్నారు. తమిళనాట కూడా ఆయనే నిర్మాత కావడంతో , తెలుగు వ్యవహారాలు పట్టించుకోలేనంత బిజీగా వున్నారు. దానికి తోడు పర్సనల్ గా కూడా బిజీగా వుండడంతో, అడియో ఫంక్షన్ కూడా పెట్టలేకపోయారు. చివరకు సినిమా మూడు రోజుల్లో విడుదలవుతుందనగా ఫిక్స్ చేసారు.
ఇదిలా వుంటే ఈ సినిమా తెలుగు హక్కులు ఇంకా పూర్తిగా అమ్ముడు కాలేదని వినికిడి. సీడెడ్ సాయి కొర్రపాటి తీసుకున్నారు. విశాఖ హక్కులు కూడా అమ్ముడయ్యాయి. మిగిలిన ఏరియాలు ఇంకా పెండింగ్ లోనే వున్నాయని వినికిడి. దీనికి కారణం సినిమాకు డిమాండ్ లేక కాదు, నిర్మాతకు మాట్లాడి, డీల్స్ సెటిల్ చేసుకునే టైమ్ లేక అని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన అడియో ఫంక్షన్ కు వస్తున్నారు కాబట్టి, ఇక చకచకా డీల్స్ ఫైనల్ కావచ్చు.