మేము సైతం లాటరీ తీసారా?

అయిదు వందలు పెట్టి టికెట్ కొనండి. అలా కొన్నవారిలోంచి 104 మందిని ఎంపిక చేసి, 12గంటల టెలీథాన్ కార్యక్రమం చూపించే అదృష్టం కలిగిస్తాం. మిగిలిన వారు హుద్ హుద్ కు విరాళం ఇచ్చారనుకోవడమే అని…

అయిదు వందలు పెట్టి టికెట్ కొనండి. అలా కొన్నవారిలోంచి 104 మందిని ఎంపిక చేసి, 12గంటల టెలీథాన్ కార్యక్రమం చూపించే అదృష్టం కలిగిస్తాం. మిగిలిన వారు హుద్ హుద్ కు విరాళం ఇచ్చారనుకోవడమే అని కార్యక్రమం ప్రకటించారు. బాగానేవుంది. ఇంతకీ అలా కొన్నవారు ఎంతమంది అన్నది తెలియదు. 

అది అలా వుంచితే, అసలు అలా కొన్నవారిలోంచి నిఖార్సుగా 104 మందిని లాటరీ తీసారా?  మేముసైతం నిర్వహణలో పాలు పంచుకున్నవారిలొ కొందరిని ప్రశ్నిస్తే వచ్చిన సమాధానం….తెలియదు…అన్నదే. 

ప్రజల్ని ఆశపెట్టి, టికెట్ లు అమ్మినపుడు, కాస్త నలుగురి సమక్షంలోనో, మీడియా సమక్షంలోనొ, లాటరీ తీసి, పేర్లు ప్రకటిస్తే అది వేరుగా వుంటుంది. అందులో నిజాయతీ కనిపిస్తుంది. మరోసారి జనం ఇలాంటి వాటిని నమ్మే అవకాశం వుంటుంది. అలా చేయకుండా, గుట్టుచప్పుడు కాకుండా, రెండో కంటికి తెలియకుండా కానిస్తే, జనం మరోసారి ఇలాంటి వ్యవహారాలను నమ్ముతారా?

ఇదిలా వుంటే సెలబ్రిటీ డిన్నర్ అన్నదానికి ఆంధ్ర, హైదరాబాద్, మొత్తం మీద 20మందే స్పందించి, 20 లక్షలు ఇచ్చారని వినికిడి. దాంతో మిగిలిన ఎనభైకి పైగా టికెట్ లు చాలా మంది ప్రొడ్యూసర్లకు, డైరక్టర్లకు అంటగట్టారట.  ఆ విధంగా సెలబ్రిటీ డిన్నర్ విత్ సెల్రబిటీలు అని పించుకున్నారన్నమాట.