సునీల్ ను మరిచిపోయినట్లేనా?

సునీల్..రెండు, మూడేళ్ల క్రితం వరకు ప్రతి సినిమాలో నవ్వులు పూయించిన పేరు. ఇప్పుడు దాదాపు జనం మరిచిపోయే స్థితికి వచ్చేసింది. గుమ్మడిపండులా వుండే సునీల్, కష్టపడి సిక్స్ ప్యాక్ చేసి, డ్యాన్స్ లు విరగదీసేలా…

సునీల్..రెండు, మూడేళ్ల క్రితం వరకు ప్రతి సినిమాలో నవ్వులు పూయించిన పేరు. ఇప్పుడు దాదాపు జనం మరిచిపోయే స్థితికి వచ్చేసింది. గుమ్మడిపండులా వుండే సునీల్, కష్టపడి సిక్స్ ప్యాక్ చేసి, డ్యాన్స్ లు విరగదీసేలా నేర్చుకుని సూపర్ అనిపించుకున్నాడు. కానీ అక్కడే తప్పటడుగులు వేసాడు. 

కమెడియన్ గా స్టార్ రేంజ్ కానీ హీరోగా కాదని గమనించలేదు. హీరోయిన్ ను డిమాండ్ చేసినట్లు గ్యాసిప్ లు, మాస్ సినిమాలే కావాలని, ఫైట్లు వుండాలని ఇలా గొంతెమ్మ కోరికలు అన్నీమించి, మూడు కోట్ల రెమ్యూనిరేషన్ కలిపి, సునీల్ ను ఆఫర్లకు దూరం చేసాయి. 

పాతిక నుంచి యాభై అరవై లక్షలు పెడితే యంగ్ హీరోలు, అప్ కమింగ్ హీరోలు చాలా మంది రెడీగా వున్నారు. అప్పుడు సినిమా బడ్జెట్ మూడు-నాలుగు మధ్య వుంటుంది. కానీ సునీల్ సినిమా బడ్జెట్ ఏడెనిమిది అవుతోంది. అది అటుఇటు కానివ్యవహారం. అందుకే ఎవరూ సునీల్ అప్రోచ్ కావడం లేదని వినికిడి.అన్నట్లు దిల్ రాజు సినిమాఅన్నారు. అది ఎంతవరకు వచ్చిందో?

అది సరే..మేము సైతం ప్రోగ్రామ్ ల్లో సునీల్ సందడి ఎక్కడన్నా కనిపించిందా?