ఈ మధ్య సినిమా రంగం క్లిష్ట పరిస్థితుల్లో వుంది. మరో పక్క నటులు, టెక్నీషియన్లు కూడా వ్యాపారం నేర్చారు. అందుకే సినిమాల్లో, డిస్ట్రిబ్యూషన్ లో, వేలు పెడుతున్నారు. దర్శకుడు పూరికి ఇలాంటివి ఎప్పటి నుంచో అలవాటు. ఇప్పుడు అదే అలవాటు ఆయన ఫ్రెండ్ చార్మికి కూడా అబ్బినట్లుంది.
జ్యోతి లక్ష్మి సినిమాకు పూరి తో పాటు, చార్మికూడా పారితోషికం తీసుకోవడం లేదు. ఇద్దరూ వాటాలు తీసుకుంటున్నారు. నిర్మాత కళ్యాణ్ కు కూడా ఇదే బాగనపించినట్లుంది..ఓకె అనేసారు. కాస్త పెట్టుబడి అయినా తగ్గుతుందని.
అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో చార్మికి పారితోషికం ఎంత వుంటుంది. మహా అయితే పాతిక లేదా ముఫై లక్షలు. అదే పది పైసలో, ఇరవై పైసలో వాటా అంటే అంతకన్నా ఎక్కువే గిట్టుబాటు కావచ్చు. పైగా పూరి ఏదో ఒకటి చేసి, సినిమాకు హైప్ తీసుకువస్తాడుగా.