ఐర్లాండ్‌పై టీమిండియా అలవోక విజయం

భారీ స్కోర్‌ సాధిస్తుందనుకున్న ఐర్లాండ్‌ అనూహ్యంగా కుప్పకూలింది. అయితేనేం టీమిండియాపై చెప్పుకోదగ్గ స్కోర్‌నే నమోదు చేసింది పసికూన ఐర్లాండ్‌. తొలుత వికెట్లు తీయడానికి ఇబ్బంది పడ్డ భారత బౌలర్లు, చివరి ఓవర్లలో చెలరేగిపోయారు. దాంతో…

భారీ స్కోర్‌ సాధిస్తుందనుకున్న ఐర్లాండ్‌ అనూహ్యంగా కుప్పకూలింది. అయితేనేం టీమిండియాపై చెప్పుకోదగ్గ స్కోర్‌నే నమోదు చేసింది పసికూన ఐర్లాండ్‌. తొలుత వికెట్లు తీయడానికి ఇబ్బంది పడ్డ భారత బౌలర్లు, చివరి ఓవర్లలో చెలరేగిపోయారు. దాంతో ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. షమీ మూడు వికెట్లు, అశ్విన్‌ రెండు వికెట్లు తీసుకోగా, ఉమేష్‌, మొహిత్‌, జడేజా, రైనా చెరో వికెట్‌ తీసుకున్నారు. మొత్తంగా ఏడుగురు భారత ఆటగాళ్ళు బౌలింగ్‌ చేయడం విశేషం.

ఇక, 260 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, 36.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లలో శిఖర్‌ ధావన్‌ ధాటిగా ఆడి సెంచరీ చేస్తే, రోహిత్‌శర్మ అర్థసెంచరీతో ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ ఔటయ్యాక కోహ్లీ, రహానే మిగతా పని అలవోకగా పూర్తి చేసేశారు. 7 పరుగుల రన్‌రేట్‌తో ఐర్లాండ్‌ని టీమిండియా మట్టికరిపించింది.

ప్రస్తుతం పూల్-బిలో టీమిండియా పాయింట్ల పరంగా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. మరోపక్క, వరల్డ్‌ కప్‌లో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా కెప్టెన్‌గా ధోనీ రికార్డులకెక్కాడు. గత రికార్డ్‌ గంగూలీ పేరిట వుంది. గంగూలీ నేతృత్వంలో టీమిండియా వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచింది. గత వరల్డ్‌ కప్‌లో టీమిండియా నాలుగు వరుస మ్యాచ్‌లను గెలవగా, ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటిదాకా ఐదు మ్యాచ్‌లను వరుసగా గెలిచిన విషయం విదితమే.