బాలయ్య లేటెస్ట్ సినిమా లయన్ శాటిలైట్ హక్కుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఎనిమిది కోట్లు, తొమ్మిది కోట్లు అని వార్తలు వినిపించాయి కానీ, ఆఖరికి ఆరు కోట్ల దగ్గర ఫైనల్ అయింది. జెమిని టీవీ ఈ హక్కులను స్వంతం చేసుకుంది.
బాలకృష్ణ సినిమా అంటే హిట్ కొడితే టీఆర్పీ ఓ రేంజ్ లో వుంటుదనే నమ్మకంతో జెమిని ఆరు కోట్ల వరకు వెళ్లింది. నాగ్, బాలయ్య వగైరా హీరోల శాటిలైట్ మార్కెట్ మొదటి నుంచీ అయిదు పైనే వుంటూ వస్తోంది. గతంలో లెజెండ్ కూడా ఇంతే పలికింది. ఇప్పుడు ఈ సినిమాకు అదే ఫిక్సయింది.
సత్య దేవ్ దర్శకత్వంలో రమణారావు నిర్మిస్తున్న ఈ సినిమాకు బిజినెస్ బాగానే జరిగింది. మరీ తరువాత చూద్దాం…అధికరేటు అని చూసుకోకుండా, దాదాపు తెలంగాణ, ఆంధ్ర ఏరియాలన్నీ అమ్మేసినట్లు వినికిడి. నిర్మాణ వర్గాల సమాచారం ప్రకారం మంచి రేటే వచ్చిందని తెలుస్తోంది.