ఆ వరల్డ్‌కప్‌ హీరో లేకుండానే…

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ కోసం బీసీసీఐ 30 మంది ఆటగాళ్ళ పేర్లను ‘ప్రాబబుల్స్‌’ జాబితాకుగాను ఖరారు చేసింది. అయితే ఇందులో గత వరల్డ్‌కప్‌ హీరో యువరాజ్‌సింగ్‌కి చోటు దక్కలేదు.…

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ కోసం బీసీసీఐ 30 మంది ఆటగాళ్ళ పేర్లను ‘ప్రాబబుల్స్‌’ జాబితాకుగాను ఖరారు చేసింది. అయితే ఇందులో గత వరల్డ్‌కప్‌ హీరో యువరాజ్‌సింగ్‌కి చోటు దక్కలేదు. యువీ మాత్రమే కాదు, సెహ్వాగ్‌, యువరాజ్‌సింగ్‌, గంభీర్‌, హర్భజన్‌సింగ్‌, జహీర్‌ఖాన్‌లపైనా సెలక్టర్లు దృష్టి సారించకపోవడం గమనార్హం. మొత్తంగా ప్రాబబుల్స్‌లో వున్నవారంతా యంగ్‌స్టర్స్‌ కావడం మరో విశేషం.

కెప్టెన్‌ ధోనీ, సురేష్‌ రైనా, కోహ్లీ, ఇషాంత్‌ శర్మ.. వీళ్ళే వరల్డ్‌కప్‌ ప్రాబబుల్స్‌కి ఎంపికైన సీనియర్లుగా భావించాల్సి వుంటుంది. ఇటీవల వన్డేల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు అంబటిరాయుడు, రోహిత్‌శర్మ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నారు. బీసీసీఐ ఖరారు చేసిన ప్రాబబుల్స్‌ లిస్ట్‌ ఇలా వుంది…

మహేంద్రసింగ్‌ ధోనీ, శిఖర్‌ ధావన్‌, రోహిత్‌శర్మ, ఆజింక్య రెహానే, రాబిన్‌ ఊతప్ప, విరాట్‌ కోహ్లీ, సురేష్‌ రైనా, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, మనోజ్‌ తివారీ, మనీష్‌ పాండే, వృద్ధిమాన్‌ సాహా, సంజూ శాంసన్‌, రవిచంద్ర అశ్విన్‌, పర్వేజ్‌ రసూల్‌, కరన్‌ శర్మ, అమిత్‌ మిశ్రా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌కుమార్‌, మహ్మద్‌ షమీ, ఉమేష్‌ యాదవ్‌, వరుణ్‌ ఆరోన్‌, ధవళ్‌ కులకర్ణి, స్టువర్ట్‌ బిన్నీ, మోహిత్‌ శర్మ, అశోక్‌ దిండా, కులదీప్‌ యాదవ్‌, మురళీ విజయ్‌.