సికిందర్ 15కోట్ల సినిమా?

సూర్య అంటే తెలుగు జనాలు తమ హీరోగానే భావిస్తారన్నది వాస్తవం. సూర్య సినిమా అంటే టాలీవుడ్ పెద్ద హిరోల సినిమాతో సమానంగా కనీసం మూడు నాలుగు వందల థియేటర్లలో విడుదలవుతాయి. ఇదంతా నిన్నటి వ్యవహారం.…

సూర్య అంటే తెలుగు జనాలు తమ హీరోగానే భావిస్తారన్నది వాస్తవం. సూర్య సినిమా అంటే టాలీవుడ్ పెద్ద హిరోల సినిమాతో సమానంగా కనీసం మూడు నాలుగు వందల థియేటర్లలో విడుదలవుతాయి. ఇదంతా నిన్నటి వ్యవహారం. అయితే గడచిన కొంత కాలంగా రెండు మూడు సినిమాలు బాగా ఆడకపోవడంతో సూర్య మార్కెట్ కాస్త తగ్గిన మాట వాస్తవం. అలా అని అతగాడి పై అభిమానుల క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు మళ్లీ సూర్య సినిమా వస్తోంది. లింగుస్వామి రూపొందించిన సికిందర్.  ఈ సారి సూర్య చాలా కాన్ఫిడెన్స్ తో వున్నాడు. టాలీవుడ్ మార్కెట్ ను నిలబెట్టుకుంటానని ధీమాగా వున్నాడు. 

సూర్యానే కాదు, తెలుగు నిర్మాతలు కూడా అతగాడి మార్కెట్ పై ధీమాగా వున్నారనడానికి సికిందర్ సినిమానే నిదర్ళనం. 15 కోట్లుకు కొన్నారీ సినిమా హక్కులను. అలా అని లగడపాటి శ్రీధర్ రిస్క్ చేసారని అనలేం. ఎందుకంటే ఇప్పటికే ఆయన బిజినెస్ పూర్తి చేసారని వినికిడి. అందువల్ల ఆయనకు సమస్య పెద్దగా  లేదు. కోనుకున్న డిస్ట్రిబ్యూటర్లకే సమస్య అంతా. కొనుకున్నమొత్తాలు ఏ మేరకు తిరిగి వస్తాయన్నది చూడాలి. నిజానికి సూర్య ఒకప్పటి మార్కెట్ తో పొల్చుకుంటే 15 కోట్లు పెద్ద మొత్తం కాదు. కానీ ఇప్పుటి పరిస్థితుల్లో అది కాస్త రిస్క్ కిందనే లెక్క.  

అయితే సినిమాకు ఏ మాత్రం పాజిటవ్ టాక్ వచ్చినా రెండు వారాల్లో ఆ మొత్తం రికవరీ అయ్యే అవకాశం వుంది. అల్లుడు శీను లాంటి సినిమా అంత భారీ హైప్ తీసుకువచ్చి, పబ్లిసిటీ చేసినా వారం మొత్తం మీద 15 కోట్లు రాబట్టగలిగింది. ఆ లెవెల్ లో కలెక్షన్ల రాబట్టగలిగితే సికిందర్ బయ్యర్లు సేఫ్ అవుతారు. లేకుంటే కష్టమే.