మెగా మేనల్లుడికి హైప్‌ పెరుగుతోంది.!

రెండో సినిమా మొదట విడుదలయి సక్సెస్‌ కావడంతో, సినిమా పూర్తయి విడుదలకు నోచుకోని మొదటి సినిమాపై క్రేజ్‌ పెరుగుతోంది. అతనెవరో కాదు, మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ. తొలి సినిమా ‘రేయ్‌’ ఈ నెల…

రెండో సినిమా మొదట విడుదలయి సక్సెస్‌ కావడంతో, సినిమా పూర్తయి విడుదలకు నోచుకోని మొదటి సినిమాపై క్రేజ్‌ పెరుగుతోంది. అతనెవరో కాదు, మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ. తొలి సినిమా ‘రేయ్‌’ ఈ నెల 27న విడుదల కానున్న విషయం విదితమే. రెండో సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విడుదలై అతనికి చెప్పుకోదగ్గ హిట్‌ ఇచ్చింది.

‘పిల్లా నువ్వు లేని జీవితం’లో డాన్సులతో అదరగొట్టిన సాయిధరమ్‌ తేజ, అసలు సిసలు డాన్సులు ‘రేయ్‌’లో వేసేశాడు. ఆ డాన్సుల సంగతేంటో టీజర్స్‌ చూస్తేనే అర్థమవుతుంది. ‘గోలీమార్‌’ పాటతోపాటు టైటిల్‌ సాంగ్‌ కూడా దుమ్మురేపింది. దాదాపు అన్ని పాటల్లోనూ సాయిధరమ్‌తేజ డాన్సులు అదరగొట్టేశాడట. ఇప్పుడు ఈ డాన్సులే సినిమాకి హైలైట్‌ అనే ప్రచారం జరుగుతోంది.

వైవీఎస్‌ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రేయ్‌’ సినిమాకి ఇంతకన్నా హైప్‌ ఇంకేముంటుంది.? కావాల్సిన హైప్‌ అయితే వచ్చేస్తోంది ‘రేయ్‌’ సినిమాకి. అంచనాల్లేకుండా వచ్చిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ హిట్టయ్యింది. అంచనాలతో వస్తున్న ‘రేయ్‌’ సినిమా.. అదీ విడుదలకు పురిటికష్టాలు పడ్డ ‘రేయ్‌’ బాక్సాఫీస్‌ వద్ద హిట్టయితే.. సాయిధరమ్‌తేజ హీరోగా తన స్టామినా నిరూపించుకున్నట్టే.