ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య ఈ రోజు జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లూ పోటా పోటీగా తలపడ్డాయి. అయితే అదృష్టం ఆసీస్ వైపు నిలిచింది. మ్యాచ్‌ని తృటిలో లంక చేజార్చుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 376 పరుగులు చేసింది. మాక్స్‌వెల్ మెరుపు సెంచరీ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కి హైలైట్ అని చెప్పాలి. స్మిత్, వాట్సన్, క్లార్క్ బాధ్యతాయుతంగా ఆడారు. దాంతో, ఆసీస్ జట్టు, లంక ముందు 377 పరుగుల టార్గెట్ వుంచింది.
భారీ టార్గెట్‌ని ఛేదించే క్రమంలో లంక కూడా జాగ్రత్తగానే ఆడిరది. ఐదు పరుగులకే తొలి వికెట్‌న్‌ని కోల్పోయిన లంక, 135 పరుగులకు రెండో వికెట్‌ని కోల్పోయిందంటే, ఎంత ప్లాన్డ్‌గా లంక ఇన్నింగ్స్ సాగిందో అర్థం చేసుకోవచ్చు. సంగక్కర సెంచరీతో చెలరేగాడు. దిల్షన్ 62 పరుగులు చేశాడు. చండిమాల్ మెరుపు అర్థ సెంచరీతో లంకను విజయపథం వైపు పరుగులు పెట్టించాడుగానీ, అంతలోనే అతని కాలి నరం పట్టేయడంతో మైదానంలో చాలా ఇబ్బంది పడ్డాడు. నొప్పితోనే కాస్సేపు క్రీజ్‌లో నిల్చున్నా, నొప్పికి తాళలేక మైదానం నుంచి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
ఇక, అక్కడి నుంచి లంక కోలుకోలేకపోయింది. 312 పరుగులకు లంక ఆలౌట్ అవడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. చండిమాల్ రిటైర్డ్ హర్ట్‌గా వెళ్ళకుండా వుండి వుంటే, ఆసీస్ వుంచిన భారీ టార్గెట్‌ని లంక ఛేదించి వుండేదేమో. ఈ మ్యాచ్ మొత్తానికి పెద్ద విశేషమేంటంటే సంగక్కర సెంచరీ. ఈ సిరీస్‌లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు సంగక్కర. కెరీర్‌లో 14 వేల పరుగుల మైలురాయినీ సంగక్కర దాటేయడం గమనార్హం.