ఒకేసారి అన్ని సినిమాలా?

మార్చి మూడోవారం భలే ముద్దొచ్చేలా వుంది. 20, 21 తేదీల్లో చాలా సినిమాలు విడుదలయ్యే అవకాశాలుకనిపిస్తున్నాయి. వస్తాయో, వాయిదా పడతాయో తెలియకదు కానీ, చాలా సినిమాల పేర్లు వినిపిస్తున్నాయి. అందునా ఇవన్నీ కూడా కాస్త…

మార్చి మూడోవారం భలే ముద్దొచ్చేలా వుంది. 20, 21 తేదీల్లో చాలా సినిమాలు విడుదలయ్యే అవకాశాలుకనిపిస్తున్నాయి. వస్తాయో, వాయిదా పడతాయో తెలియకదు కానీ, చాలా సినిమాల పేర్లు వినిపిస్తున్నాయి. అందునా ఇవన్నీ కూడా కాస్త చూడాలనిపించేవే కావడం విశేషం. 

సాయి కొర్రపాటి సీమ రాజకీయాల నేపథ్యంలో నిర్మించిన తుంగభద్ర, కన్నడంలో హిట్ సినిమాను తెచ్చి, లగడపాటి శ్రీధర్ రీమేక్ చేసిన కృష్ణమ్మకలిపింది ఇద్దరిని, సందీప్ కిషన్ మాంచి ఆశలు పెట్టుకున్న టైగర్, అశ్వనీదత్ కుమార్తెలు నిర్మించిన ఎవడే సుబ్రహ్మణ్యం, రవిబాబు సిద్దం చేసిన అవును 2 సినిమాల విడుదల వుండొచ్చని తెలుస్తోంది. 

అంటే అయిదు సినిమాలు. పోనీ చివరికి పోటీ లోంచి ఏవో రెండు తప్పుకున్నా, మూడు ఖాయంగా వుంటాయి. అంటే మాంచి హడావుడే.