‘భయో’ డేటా: నారా ‘బాబే’ష్!

పేరు : నారా చంద్రబాబు నాయుడు ఫాదర్ నారా లోకేష్ నాయుడు. Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం : ఉద్యోగం కాదు, రాజధాని కట్టేందుకు కాంట్రాక్టు. మెట్రోరైలూ, ఎయిర్ పోర్టులూ అయితే ఎల్ అండ్‌టీ,…

పేరు : నారా చంద్రబాబు నాయుడు ఫాదర్ నారా లోకేష్ నాయుడు.

దరఖాస్తు చేయు ఉద్యోగం : ఉద్యోగం కాదు, రాజధాని కట్టేందుకు కాంట్రాక్టు. మెట్రోరైలూ, ఎయిర్ పోర్టులూ అయితే ఎల్ అండ్‌టీ, జీఎంఆర్‌లకు ఇచ్చే వారు. రాజధాని నిర్మాణం కదా! రాజకీయా పార్టీలకిస్తున్నారు. వోట్ల టెండర్లలో ఈ కాంట్రాక్టు మా పార్టీకి వచ్చింది. 

ముద్దు పేర్లు : చంద్ర ‘డాబు’( దాదాపు 34 వేల ఎకరాల్లో, సింగపూర్‌ని తలపించే రాజధానిని నిర్మిస్తున్నాను. పైకి డాబు గా కనిపించవచ్చు కానీ, ఇది మాత్రం నిజం.)

‘విద్యార్హతలు : బి.ఎల్ ( అంటే బ్యాచిలర్ ఆఫ్ లా అని అనుకునేరు. కాదు. బ్యాచిలర్ ఆఫ్ లాండ్ పూలింగ్ అని చదువుకోవాలి. భూసేకరణ (లాండ్ ఎక్విజిషన్ (భూసేకరణ) చట్టపరిధిలోకి రాకుండా జాగ్రత్తగా బైపాస్ రూట్‌లో భూసమీకరణ ప్రవేశపెట్టాను. 

గుర్తింపు చిహ్నాలు :

  • ఒకటి: రైతులెక్కడ వుంటే అక్కడకొస్తాను. అందుకే నన్ను ‘రైతు బాందవుడు’ అని అంటారు. రైతు దగ్గరకు వెళ్ళ కుండా భూమి తీసుకోవటం సాధ్యం కాదు కదా!
  • రెండు: యువకులెక్కడ వుంటే అక్కడ నేనుంటాను. అందుకే నన్ను ‘హైటెక్’ నేత అంటారు. లోకేష్ ను ముందుపెట్టానంటే, యువకులను ప్రోత్సహిస్తున్నట్లే కదా!

సిధ్ధాంతం : ఉన్నవాళ్ళే వాటికి కట్టుబడి వుండటం లేదు. ఏ ప్రాజెక్టు కట్టుకోకుండా కేవలం రుతు ‘పవనా’ల మీద ఆధారపడుతున్నారు. (అంటే పవన్, బీజేపీకి మద్దతు గా వచ్చారన్నది నా ఉద్దేశ్యం కాదు. ఆయన నాతో కూడా రాష్ర్ట సంక్షేమం గురించి చర్చలు జరిపారు.)

వృత్తి :  పునాదులు తవ్వేసి, గోడలు లేపమమని కేంద్రాన్ని అడగటం. 

హాబీలు : 

  1. పక్క రాష్ర్టంలో ‘చంద్రుణ్ణి’ అనుకరించటం. అక్కడ ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే, ఇక్కడే అదే ఇవ్వటం. 
  2. హామీలు నేనిచ్చి, నెరవేర్చమని నరేంద్రమోడీని కోరటం.

అనుభవం : ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వారిని( రాజకీయ పార్టీల వారిని) గాఢంగా కౌగిలించుకోవటం. ఒక్క సారి మన కౌగిలిలోకి వచ్చాక, నలిగి ముక్కలు కావాల్సిందే. కిట్టని వారు  నా కౌగిలిని దృతరాష్ర్ట కౌగిలితో పోలుస్తారు. నిజం చెప్పండి. మనకున్న శక్తి దృతరాష్ర్టుడికి వుంటుందంటారా? 

మిత్రులు : ‘చంద్రుడు’ చంద్రుడి’తోనే  స్నేహం చేస్తాడు. అందుకే ఆయనా నేనూ అన్నీ చర్చలతోనే పరిష్కరించుకుంటున్నాం. కలిసి పంచుకుంటున్నాం.. నీళ్ళయినా, నిప్పులయినా.

శత్రువులు : సిధ్దాంతాలున్న వారికి శత్రువుల బెడద. మనకి అలాంటి గొడవ లేదు.

మిత్రశత్రువులు : బడ్జెట్ లో ఒకప్పుడు ‘మొండి చెయ్యి’ అని చూపించే వారు. కాంగ్రెస్ కేంద్రంలో వుండేది కాబట్టి. కానీ నేడు అలా కాదు.  ఏ ‘చెయ్యీ’ చూపకుండా, చెవిలో పువ్వు పెడుతోంది. 
వేదాంతం : ముందొచ్చిన ‘జగన్’ కన్నా. వెనకొచ్చిన ‘పవన్’ వాడి. ప్రతిపక్షంలో కూడా మన వాడే వుంటే, అదో ‘తుత్తి’!

జీవిత ధ్యేయం : పూర్తి రాష్ర్ట ముఖ్యమంత్రి నుంచి, సగం రాష్ర్ట ముఖ్యమంత్రి అయ్యాక.. వేరే ధ్యేయం ఏముంటుంది. పావు రాష్ర్టమయితే రాదు కదా!
 
సర్