దేవర 2 ఎందుకు తీయడం లేదు?

అంత బ్లాక్ బస్టర్ అయితే సీక్వెల్ తీయకుండా వుండడం అంటే దాని వెనుక అసలు కథ ఏదో వుండి వుండాలి. అదే బయటకు రావడం లేదు.

బాహుబలి పెద్ద హిట్.. వెంటనే బాహుబలి 2. పుష్ప పెద్ద బ్లాక్ బస్టర్.. వెంటనే పుష్ప 2. టిల్లు.. టిల్లు స్క్వేర్.. మ్యాడ్..మ్యాడ్ 2. ఇలా ప్రతి హిట్ కు సీక్వెల్ వచ్చాయి. రెండు సినిమాలకు తప్ప. ఒకటి దేవర. రెండు సలార్. ఈ రెండు సినిమాల విడుదల టైమ్ లో జరిగిన హడావుడి ఇంతా కాదు.

ముఖ్యంగా దేవర సినిమా టైమ్ లో. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేసిన సినిమా కనుక, మార్కెట్ ను నిలబెట్టాలని కిందా మీదా పడ్డారు. తెలుగు నాట అయితే కలెక్షన్లు బయటకు రాకుండా, వాళ్లు రిలీజ్ చేసిన కలెక్షన్లు మాత్రమే చలామణీ అయ్యేలా చూసారు. సినిమా బ్లాక్ బస్టర్ అని ఊదరగొట్టారు.

కానీ దేవర సీక్వెల్ ను మాత్రం కోల్డ్ స్టోరేజ్ లో వుంచారు. అసలు దేవర 2 అనే సినిమా వుంటుందా.. వుండదా అనేంత అబేయన్స్ లోకి వెళ్లిపోయింది. ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్, నీల్సన్ ఇలా వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. దేవర 2 సినిమా సంగతి మాత్రం నాట్ వన్ పర్సంట్ తెలియడం లేదు. దేవర సినిమాను జపాన్ లో విడుదల అంటూ హడావుడి చేసారు. కానీ ఏమాత్రం పైసలు వచ్చాయో తెలియుదు.

కనీసం ఈ సందర్భంగా అయినా దేవర 2 సినిమా విడుదల గురించి ఎన్టీఆర్ మాట్లాడలేదు. మరి దేవర సినిమా అంతా గొప్ప సినిమా అయితే, అంత బ్లాక్ బస్టర్ అయితే సీక్వెల్ తీయకుండా వుండడం అంటే దాని వెనుక అసలు కథ ఏదో వుండి వుండాలి. అదే బయటకు రావడం లేదు. దేవర 2 వీలయినంత త్వరగా రావాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఏం చేస్తారో?

21 Replies to “దేవర 2 ఎందుకు తీయడం లేదు?”

  1. నేను బహుశా ఐదవ రోజు వెళ్లా అనుకుంటా అప్పటికే థియేటర్ లో జనాలు లేరు, అసలు సినిమా ఎవరికి నచ్చలేదు అని ప్రేక్షకుల expression లో క్లియర్ గా కనబడుతుంది అయినా అన్ని కోట్లు వసూలు చేసిందంటే ఆశ్చర్యమే

  2. 300 కోట్లు. అన్నారు సినిమా అంతా.ఖాళీ. ఇదొక కొత్త ట్రెండ్. ప్రతిదీ fek ne

  3. తీస్తే ఎందుకు తీస్తున్నారు అని అడగాలీ రా సన్నాసి??😂😂

    అనవసరం అయినవి అడుగు తావు కానీ అవసరం అయినవి అడగవు

    1. Don’t compare Devara with above list. The list you have mentioned is much awaited movies for all movie audience. Devara is disaster and fans were not interested in Devera 2. There won’t be any business to Devera 2 . Just to pay for part1 losses

Comments are closed.