సారంగపాణి..కామెడీ రైడ్

ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలు అరుదుగా వస్తాయి. ఇప్పుడు ట్రెండ్ ప్రకారం యూత్ ఫుల్ కామెడీ లే ఎక్కువ. ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు తక్కువ. జంధ్యాల, ఈవీవీ లాంటి వాళ్లు అందించిన సినిమాలు ఇప్పటికీ…

ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలు అరుదుగా వస్తాయి. ఇప్పుడు ట్రెండ్ ప్రకారం యూత్ ఫుల్ కామెడీ లే ఎక్కువ. ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు తక్కువ. జంధ్యాల, ఈవీవీ లాంటి వాళ్లు అందించిన సినిమాలు ఇప్పటికీ మనకు గుర్తే. ఈ తరం దర్శకుడు ఇంద్రగంటి కూడా ఈ తరహా దర్శకుడే మంచి క్లాసిక్ కామెడీ సినిమాలు అందించారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఓ మూవీ అందిస్తున్నారు. సారంగపాణి జాతకం. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, తనికెళ్ల, నరేష్ తదితరులు నటించిన సినిమా ఇది. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది.

జాతకాల మీద నమ్మకం వున్న కుర్రాడు, ఆ నమ్మకంతో తన ప్రేమను, పెళ్లిని, జీవితాన్ని ఎలా అయోమయం చేసుకున్నాడు అనే కాన్సెప్ట్ తో తయారవుతున్న సినిమా ఇది. ట్రయిలర్ ఆద్యంతం డైలాగ్ కామెడీతో నిండిపోయింది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవా హర్ష లవే కీలక పాత్రలు అని అర్థం అవుతోంది. అవసరాల శ్రీనివాస్ భిన్నమైన పాత్రలో కనిపించారు. తనికెళ్ల జస్ట్ ఒక్క సీన్ లో వున్నారు.

లవ్ స్టోరీ ని, జాతకాల మీద నమ్మకాలను రెండింటినీ సమానంగా మేళవిస్తూ, చిన్న థ్రిల్లర్ టచ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో అమీ తుమీ లాంటి కన్ఫ్యూజన్ కామెడీ సినిమా చేసారు ఇంద్రగంటి, ఇప్పుడు కూడా అలాంటి ఛాయలు కనిపించాయి. సినిమాలో పాయింట్ ఏమిటి అన్నది క్లారిటీగా హింట్ ఇవ్వలేదు కానీ, చావడం, హత్యాయత్నం, హత్యా ప్రయత్నం లాంటివి ట్రయిలర్ లో కనిపించాయి. చూస్తుంటే అదే అసలు సిసలు పాయింట్ అనిపిస్తోంది.

ఈ సినిమా 25న థియేటర్లలోకి వస్తోంది.

One Reply to “సారంగపాణి..కామెడీ రైడ్”

Comments are closed.