రాజ్ తరుణ్ Vs లావణ్య.. ఆ విల్లా ఎవరిది?

రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ మళ్లీ తెరపైకొచ్చింది.

అంతా సద్దుమణిగిందనుకున్నాం. లావణ్య బహిరంగంగా రాజ్ తరుణ్ కు సారీ చెప్పింది. కనిపిస్తే కాళ్లు పట్టుకుంటానని కూడా అనేసింది. రీసెంట్ గా రాజ్ తరుణ్ కూడా తన సినిమా ప్రమోషన్ తో బయటకొచ్చాడు. ఆల్ వెల్ అనుకున్న టైమ్ లో మరో కుదుపు.

రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ మళ్లీ తెరపైకొచ్చింది. ఈసారి వివాదానికి కారణం విల్లా. ప్రస్తుతం లావణ్య ఉంటున్న విల్లా రాజ్ తరుణ్ ది. కాబట్టి అందులో తమకు కూడా హక్కు ఉందంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఈరోజు ఆ విల్లాలోకి వెళ్లే ప్రయత్నం చేశారు.

అయితే తమను విల్లాలోకి రాకుండా లావణ్య అడ్డుకుందని, బయటకు గెంటేసిందని రాజ్ తరుణ్ తండ్రి ఆరోపిస్తున్నాడు. ఇంట్లోకి అడుగుపెట్టేంత వరకు కదిలేది లేదంటూ విల్లా ముందు బైఠాయించారు.

అటు లావణ్య వెర్షన్ మరోలా ఉంది. రాజ్ తరుణ్ తండ్రి 15 మందితో తనపై దాడి చేశారని, పైన బెడ్ రూమ్ లో తను ఉంటే లాక్కొచ్చి బయటకు గెంటే ప్రయత్నం చేశారని లావణ్య ఆరోపిస్తోంది. అందుకే వాళ్లను ఇంట్లోకి రానివ్వలేదని చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా మరో ఆసక్తికర ప్రకటన చేసింది లావణ్య. రాజ్ తరుణ్ తదనంతరం ఆ విల్లా తనకు చెందుతుందని, ఆ విధంగా తన చిన్నోడు (రాజ్ తరుణ్) వీలునామా రాశాడని చెబుతోంది. ఈలోగా తన అనుమతి లేకుండా రాజ్ తరుణ్.. లేదా రాజ్ తరుణ్ అనుమతి లేకుండా తను ఆ విల్లాను అమ్మడానికి వీల్లేదనే ఒప్పందం కూడా వీలునామాలో ఉన్నట్టు చెప్పుకొచ్చింది.

పైగా ఆ విల్లా కొనే టైమ్ లో రాజ్ తరుణ్ కు తన తండ్రి ఆర్థిక సాయం చేశాడని, 80 లక్షల రూపాయల మొత్తానికి సంబంధించి ఆధారాల్ని కోర్టుకు కూడా ఇచ్చామని అంటోంది లావణ్య. దీంతో వీళ్లిద్దరి వివాదం కొత్త మలుపు తీసుకున్నట్టయింది.

ఎప్పట్లానే రాజ్ తరుణ్ సైలెంట్ గా ఉన్నాడు. తన సినిమా ప్రచారంలో భాగంగా అతడు మరోసారి మీడియా ముందుకొచ్చినప్పటికీ ఈ వివాదంపై స్పందించడానికి అతడు నిరాకరించొచ్చు. ఎందుకంటే, విషయం కోర్టులో ఉంది. అటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం, తాము విల్లా దగ్గరకు వచ్చినట్టు రాజ్ తరుణ్ కు తెలియదని చెబుతున్నారు.

9 Replies to “రాజ్ తరుణ్ Vs లావణ్య.. ఆ విల్లా ఎవరిది?”

  1. రాజ్ తరుణ్ కొత్త మూవీ రిలీజ్ అవుతున్నట్లుంది…అందుకే తెర మీదకు ఈ గొడవ మళ్లీ

  2. HCU లాండ్స్ మీద ఆర్టికల్ రాయడం చేతకాదు గానీ, ఇలాంటి పనికిమాలిన విషయాల మీద రాయు.

    ఒక్కో క్లిక్ కి ఎంతొస్తుంది నీకు?

Comments are closed.