తెలంగాణ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులు వస్తాయని ఆశించిన ముగ్గురు ఎమ్మెల్యేలు విస్తరణ రద్దు కావడంతో నిరాశ చెందిన విషయం తెలిసిందే. వారిలో అసంతృప్తి, ఆగ్రహం పెల్లుబికాయి. ఆ కోపాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. మంత్రి పదవులు రాకపోవడంతో అసంతృప్తి చెందుతున్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరో తెలుసు కదా. వాళ్లే…కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు.
వీళ్లు ముగ్గురూ బహిరంగంగానే తమ అసంతృప్తిని, కోపాన్ని వెళ్లగక్కారు. ఒక విధంగా అధిష్టానాన్ని ధిక్కరించారు. రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకపోవడానికి జానారెడ్డి కారణమని ఆయనపై మండిపడ్డాడు. ధర్మరాజులా ఉండాల్సిన ఆ సీనియర్ నాయకుడు ధృతరాష్ట్రుడిలా మారాడని తూలనాడాడు. ప్రేమ్ సాగర్ రావు తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే సహించనని అన్నాడు. ఓ కుటుంబం తన గొంతు కోయాలని చూస్తోందని ఆక్రోశించాడు. గడ్డం వివేక్ తాను కాంగ్రెసులోకి వచ్చి తప్పు చేశానన్నట్లుగా మాట్లాడాడు. తాను బీజేపీలోనే ఉన్నట్లయితే కేంద్ర మంత్రిని అయ్యేవాడినని అన్నాడు.
తమకు మంత్రి పదవులు ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అన్నట్లుగా మాట్లాడారు. ఇక నోవాటెల్ హోటల్లో జరిగిన సీఎల్పీ సమావేశానికి ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు ముగ్గురూ హాజరుకాలేదు. వీళ్ల గైర్హాజరుపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యాడు. మంత్రి పదవులు రాకపోవడంపై వాళ్లు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పదవులు రావని.. మీరే నష్టపోతారని తేల్చి చెప్పాడు. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై అధిష్టానమే ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు. పార్టీ లైన్ దాటి ఎవరూ కామెంట్స్ చేయొద్దంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి.
ఈ సందర్భంగానే ఎలా ఉంటే మంత్రి పదవులుగాని, ఇతర పదవులు వస్తాయో చెప్పాడు. అందుకు ఒక నాయకుడిని ఉదాహరణగా చూపించి ఆయన మాదిరిగా ఉండాలని హితబోధ చేశాడు. రేవంత్ చెప్పిన ఆ నాయకుడు ఎవరు? ఆయనే ఇటీవలే ఎమ్మెల్సీ అయిన అద్దంకి దయాకర్. పదవులు కావల్సిన ఎమ్మెల్యేలు దయాకర్‌ను చూసి నేర్చుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పాడు. దయాకర్ ఓపికకు మారుపేరని, పదవి వచ్చేవరకు వేచి ఉన్నాడని చెప్పాడు. ఆయనకు గతంలోనే ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పటికీ చివరి క్షణంలో అది రద్దయిందని, కాని ఆ సమయంలోనూ ఆయన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని, బహిరంగంగా విమర్శలు చేయలేదని రేవంత్ రెడ్డి చెప్పాడు.
అంత ఓపికగా ఉన్నాడు కాబట్టే ఎమ్మెల్సీ అయ్యాడని అన్నాడు. ఆయన పార్టీ కోసం నిబద్ధతో పనిచేస్తున్న నాయకుడని ప్రశంసించాడు. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చాడు. విస్తరణను అధిష్టానం ఫ్రీజ్ చేసిందని, కాబట్టి పదవులు కావలసినవారు నేరుగా అధిష్టానంతో మాట్లాడుకోవాలని అన్నాడు. మొత్తం మీద రేవంత్ చెప్పింది ఏమిటంటే …పదవుల కోసం నాయకులు పాకులాడకూడదు. ఓపికగా వేచివుండి అధిష్టానం ఇస్తే తీసుకోవాలి.
Vaadoka lucha potreddy gaadu oka lucha
పార్టీ కోసం నిబద్దతగా పనిచేస్తే పదవులు వస్తాయి. ప్రజల కోసం పని చేస్తే కాదు.