రేణు దేశాయ్ కూడా పవన్ బాటలోనే

యధా పవన్ తధా రేణు అన్నట్లు వుంది. పవర్ స్టార్ మాజీ సతీమణి రేణు దేశాయ్ వున్నట్లుండి ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసారు.

యధా పవన్ తధా రేణు అన్నట్లు వుంది. పవర్ స్టార్ మాజీ సతీమణి రేణు దేశాయ్ వున్నట్లుండి ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసారు. తమకు కిట్టిన వ్యవహారాలు కనిపించవు. తక్కినవే కనిపిస్తాయి. రైతులు, ప్రకృతి గురించి మాట్లాడే పవన్ కు అమరావతిలో పంట పొలాలు కనుమరుగు కావడం పట్టదు. వైజాగ్ రుషికొండ పాదం చుట్టూ తొలిచేస్తే మాత్రం నానా యాగీ చేస్తారు. ఆయన హైదరాబాద్ లో నాలుగు వందల ఎకరాల గొడవ పట్టదు.

ఇప్పుడు అదే బాటలో వున్నారు పవన్ మాజీ సతీమణి రేణు దేశాయ్. ఆమెకు కూడా అమరావతి గురించి అస్సలు తెలియదు. తెలుసుకోరు, మాట్లాడరు. కానీ అన్నీ తనకే తెలుసున్నట్లు హైదరాబాద్ లో వర్తమానంలో జరుగుతున్న 400 ఎకరాల రగడ మీద మాత్రం కామెంట్ చేయగలరు.

రాజకీయంగా చైతన్యంగా వుండాలి. అన్యాయాల మీద ముందుకు అడుగు వేయాలి. ఎవరు ఆ పని చేసినా తప్పు లేదు. కానీ అన్యాయం ఎక్కడ జరిగినా అన్యాయమే. తప్పు ఎవరు చేసినా తప్పే. అలా చెప్పగలిగితేనే చెప్పాలి. లేదూ తమకు నచ్చితే ఒకలా, నచ్చకుంటే మరోలా అంటే సోషల్ మీడియాలో ట్రోల్ కావడం. మినహా మరేమీ వుండదు.

రేణు దేశాయ్ కూడా సామాజిక అంశాల మీద యాక్టివ్ గా వుండాలని, సామాజిక సంస్థల కార్యకలాపాల్లో పాల్గొనాలని ఇటీవల కాస్త ఉత్సాహంగా వున్నారు. చూస్తుంటే ఏదో ఒక బ్రాండ్ అంబాసిడర్ పదవి వరించేలాగే వుంది భవిష్యత్ లో.

16 Replies to “రేణు దేశాయ్ కూడా పవన్ బాటలోనే”

  1. హైదరాబాదు ఒక లక్షా అరవై వెల ఎకరాలలొ ఉంది. ఇది సుమ్మారు ORR లొపల ఉన్న భూమి! ఇక్కడ కూడా ఒకప్పుడు వ్యవసాయమె చెసెవారు?

    భారత దెశం లొ అన్ని పట్టణాలు చుట్టూ ఉన్న పల్లెటూర్లని కలుపుకొనె విస్తరించాయి? అది hyderabad అయినా vizag అయినా అమరావతి అయినా..

    1. కావొచ్చు గాని ఇప్పుడు అక్కడ మంచి వన్య ప్రాణులు బతుకుతున్నాయి చక్కగా చెట్లు పెరిగాయి ప్రభుత్వాలు ఎలాగు ఇలాంటి పనులు చేసేది లేదు నాచురల్ గా ఉన్న వాటిని పాడు చేయొద్దు

      1. Aa land IMG bharat ki eppudo CBN kattavettasadu…court lo a case leka pothe ippudu akkada nadavadniki kuda place undedhi scam la kosam panikivache bhumi development ki panikiradha…ippudu alage undali anevallu img bharat ki easichinappudu endhuku matladaledhu

  2. దేశానికీ అన్నం పెట్టె బంగారం లాంటి వ్యవసాయ భూమిని రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నప్పుడు మేధాపాట్కర్ అనే ఆమె పోరాటం చేసింది . అప్పుడు రేణు దేశాయ్ గొంతు ఏమైంది ?

  3. అక్కడ PK land కొన్నారు కదా పిల్లలకు వాటా వస్తుందని మాట్లాడలేదులెండి అక్కడ వ్యవసాయ భూములు కాంక్రీట్ jungle గా మారిన పర్లేదు

Comments are closed.