ఏప్రిల్ ఫూల్స్‌.. ఫూల్స్‌.. ఫూల్స్‌!

రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు ఏప్రిల్ ఫూల్ చేశార‌ని రోజా విమ‌ర్శించారు.

మాజీ మంత్రి ఆర్కే రోజా మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. త‌ప్పుడు హామీలిచ్చి, జ‌నాన్ని ఫూల్స్ చేశార‌ని ఆమె విరుచుకుప‌డ్డారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డానికి వైఎస్ జ‌గనే కార‌ణ‌మ‌ని, పెట్రోల్ బంక్‌ల వ‌ద్ద లోకేశ్ సెల్ఫీలు తీసుకోడాన్ని ఆమె ప్ర‌స్తావించారు. ఇప్పుడు పెట్రోల్ బంకుల వ‌ద్ద సెల్ఫీలు తీసుకునే ద‌మ్ముందా? అని ఆమె నిల‌దీశారు.

రోజా మీడియాతో మాట్లాడుతూ ప‌లు అంశాల్ని ప్ర‌స్తావించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు ఏప్రిల్ ఫూల్ చేశార‌ని రోజా విమ‌ర్శించారు. జ‌నాన్ని ఫూల్స్ చేయ‌డ‌మే చంద్ర‌బాబు ప‌నిగా పెట్టుకున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. వలంటీర్లు, నిరుద్యోగుల్ని ఫూల్స్ చేసి రోడ్డున ప‌డేశార‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమ్మ ఒడి ఇవ్వ‌కుండా త‌ల్లులు, పిల్ల‌ల్ని చంద్ర‌బాబు ఫూల్స్ చేశార‌ని దెప్పి పొడిచారు. ఉచిత బ‌స్సు పేరుతో మ‌హిళ‌ల్ని ఫూల్స్ చేశార‌ని ఆమె అన్నారు.

ప‌ది నెల‌ల కాలంలో రూ.1.52 ల‌క్ష‌ల కోట్లు అప్పు చేసి విజ‌న‌రీగా ప్ర‌చారం చేసుకుంటున్నాడ‌ని బాబుకు చుర‌క‌లు అంటించారు. చెత్త సీఎంగా చంద్ర‌బాబు చ‌రిత్ర సృష్టించార‌ని ఆమె అన్నారు. జ‌గ‌న్ రూ.15 ల‌క్షల కోట్లు అప్పులు చేసిన‌ట్టు చంద్ర‌బాబు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని రోజా విమ‌ర్శించారు. చివ‌రికి అసెంబ్లీ వేదిక‌గా అప్పుల‌పై తాను త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టు అంగీక‌రించార‌న్నారు.

మంత్రి నారా లోకేశ్ కామెడీ పాద‌యాత్ర చేశార‌ని విమ‌ర్శించారు. పెట్రోల్ బంకులు, షాపుల ద‌గ్గ‌ర సెల్ఫీలు తీసుకున్నార‌న్నారు. ఇప్పుడు సెల్ఫీలు తీసుకునే ద‌మ్ముందా? అని రోజా ప్ర‌శ్నించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పోలీసులు ప‌నిచేస్తే ప‌ర్య‌వ‌సానాలు ఎదుర్కోవాల్సి వుంటుంద‌ని రోజా హెచ్చ‌రించారు.

16 Replies to “ఏప్రిల్ ఫూల్స్‌.. ఫూల్స్‌.. ఫూల్స్‌!”

  1. రోజా కి ఇంకా గుండెపోటు రాలేదా.. తొందరలోనే వస్తుంది.. ముంబై లో కొడాలి పక్కనే బెడ్డు రెడీ చేసుకోండి..

  2. మీరు లక్ష్మీపార్వతి గారు శ్రీ రెడ్డి గారు జగన్ గారిని వదలకుండా ఉంటే టీడీపీ జనసేన వాళ్లే ఎంతో కొంత మీకు ముట్టచెబుతారు

  3. Aunty, janalu mimmalni fools chesi pakkana pettaru… Enduku tondara. Vallu pani cheyaka pote, next elections lo face chestaru. Appati daka ni gbbu noru vesukoni padipoku

Comments are closed.